Begin typing your search above and press return to search.

మహమ్మారి పేషంట్ తో లవ్ లో పడ్డ నర్సు

By:  Tupaki Desk   |   30 May 2020 4:00 AM GMT
మహమ్మారి పేషంట్ తో లవ్ లో పడ్డ నర్సు
X
ఆపదే వారిద్దరిని కలిపింది.. తనకు బతికిచ్చిన ఆ నర్సు నిస్వార్థ సేవకు ఆ మహమ్మారి సోకిన యువకుడు చలించిపోయాడు. ఆ ప్రేమను ఎల్లకాలం పొందుదామని నర్సుకు ప్రేమ ప్రతిపాదన పెట్టాడు. ఆమె ఓకే చెప్పింది. దీంతో మహమ్మారి సోకిన యువకుడితో ఆ నర్సు ప్రేమలో పడిపోయింది. వీరిద్దరి ప్రేమ పిక్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.

మహమ్మారి రోగుల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్యులు, నర్సులు పోరాడుతున్నారు. తమ ప్రాణాలను లెక్కచేకుండా రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. దీంతో కోలుకున్న రోగులు ఆ వైద్యులు, నర్సులకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోతున్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్న వారిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

తాజాగా విదేశాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన అందరి మనసులను కదిలిస్తోంది. వైరల్ అవుతున్న ఈ చిత్రాల్లో ఓ అందమైన నర్సు.. ఒక మహమ్మారి సోకిన యువకుడికి చికిత్స చేస్తూ కనిపిస్తోంది. అతడు కోలుకునే దాకా అతడికి సపర్యలు చేసి బాగు చేసింది. దీంతో తనకు సేవ చేసిన నర్సుకు ఒక రింగ్ తో అదే ఆస్పత్రిలో ప్రపోజ్ చేశాడు ఆ మహమ్మారి నుంచి కోలుకున్న యువకుడు. ఆ నర్సు కూడా యువకుడి ప్రేమకు కదిలిపోయింది. ఇద్దరూ ఆస్పత్రులోనే నిశ్చాతార్థం చేసుకున్నారు. ఈ చిత్రం హృదయాలను కరిగించే విధంగా ఉంది. పీపీఈ కిట్స్ తో ఉన్న నర్సు, కోలుకున్న మహమ్మారి యువకుడు అదీ ఆస్పత్రిలో ఒక్కటవ్వడం.. ఆ నర్సు ముసిముసి నవ్వులు.. ప్రేమ భావన.. చూస్తేనే హైలెట్ గా ఉంది.

అందుకే అంటారు ప్రేమ గుడ్డిది.. షరతులకు లొంగనిది అనీ.. ప్రపంచంలోని నిజమైన ప్రేమకథలు మన హృదయాలను తాకుతుంటాయి. తన కోసం అంత చేసిన ఆ నర్సును తన జీవితంలోకే ఆహ్వానించిన ఆ యువకుడి చర్య ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తోంది. నిజంగానే మహమ్మారి కలిపింది ఈ జంటను అనుకోవచ్చు.