గుడ్ న్యూస్.. దేశంలో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరుగుదల

Tue Jan 24 2023 13:00:01 GMT+0530 (India Standard Time)

number of people doing jobs in the country.. All of them are 18-25 years old

ఇటీవల కాలంలో ఎప్పుడూ బయటకు రాని ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దేశంలో ఉద్యోగం చేసే వారి సంఖ్యలో భారీగా పెరుగుదల తాజాగా గుర్తించారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది.2022 నవంబరులో ఈపీఎఫ్ చందాదారులు నికరంగా 16.2లక్షల మంది చేరినట్లుగా చెబుతున్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ పెరుగుదల ఏకంగా 16.5 శాతం ఉండటం గమనార్హం.

అంతేకాదు.. 2022 అక్టోబరు గణాంకాలతో పోల్చినా ఇది 25.67 శాతం ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఉద్యోగంలోకి చేరిన వెంటనే ఉద్యోగస్తులకు ఈపీఎఫ్ చందాదారులుగా చేర్చటం తెలిసిందే. దీంతో.. ఈ సంస్థకు అప్లికేషన్లు ఎన్ని వచ్చాయన్న ఆధారంగా ఈ లెక్కను సింఫుల్ గా చెప్పొచ్చని చెబుతున్నారు.

నవంబరులో 16.26 లక్షల మంది ఉద్యోగాల్లో చేరితో అందులో మొదటిసారి జాబ్ లో చేరిన వారి సంఖ్య 8.99 లక్షలుగా గుర్తించారు. అంతకుముందు నెల అంటే అక్టోబరు 2022లో 7.28 లక్షల మంది చేరగా.. వారికి మరో 1.71 లక్షల మంది అదనంగా నవంబరులో చేరినట్లుగా గుర్తించారు.

ఇక.. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి వయసు 18-21 మధ్య ఉందని.. అలాంటి వారు 2.77 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. ఇక.. 22-25 మధ్య వయస్కులు 2.32 లక్షల మందిగా గుర్తించారు.

పీఎఫ్ లో చేరిన వారిలో 11.2 లక్షల మంది ఈఫీఎఫ్ వో మెంబర్ షిప్ లో కూడా చేరినట్లు గుర్తించారు. ఉద్యోగాల్లో చేరే వారిలో మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022లో నవంబరులో ఉద్యోగాల్లో చేరిన మహిళల సంఖ్య 3.19 లక్షలు కాగా.. అంతకు ముందు నెలలో ఈ సంఖ్య 2.63 లక్షలే కావటం గమనార్హం. ఏమైనా ఉద్యోగాల్లో చేరే వారిలో యూత్ ఎక్కువగా ఉండటం ఆసక్తికరంగామారింది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.