Begin typing your search above and press return to search.

కర్ణాటక నంబర్ గేమ్ ఇలా!

By:  Tupaki Desk   |   9 July 2019 8:00 AM GMT
కర్ణాటక నంబర్ గేమ్ ఇలా!
X
సంకీర్ణ ప్రభుత్వ మనుగడ కోసం సీఎం కుమారస్వామి - మాజీ సీఎం సిద్ధరామయ్య సూచన మేరకు పలువురు మంత్రులు పదవీత్యాగం చేశారు. ఈక్రమంలో అసంతృప్తులను కూడా మంగళవారం బెంగళూరు రావాలని ఆహ్వానించారు. సీఎల్పీ భేటీకి తప్పక హాజరు కావాలని ఆదేశించారు. అదేవిధంగా జేడీఎస్‌ ఎమ్మెల్యేలను ఇప్పటికే రిసార్టులకు తరలించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు రిసార్టుకుల వెళ్తారనే ప్రచారం సాగినా.. బీజేఎల్పీ భేటీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

కాగా సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల సంఖ్య కంటే బీజేపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఎమ్మెల్యేలు లేరు. మ్యాజిక్‌ నంబరును బీజేపీ దాటేసింది. కాంగ్రెస్‌ నుంచి 9 మంది రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ బలం 70కు చేరుకుంది. అదేవిధంగా జేడీఎస్‌ నుంచి ముగ్గురు రాజీనామా చేయడంతో 34గా ఉంది. బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వ బలం 105గా ఉంది. అయితే బీజేపీ 105కు తోడు ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో వారి సంఖ్య 107కు చేరుకుంది.

సంకీర్ణ బలం మరింత దిగువకు..

జూలై 5వ తేదీ

మొత్తం – 224 మంది
మ్యాజిక్‌ నంబరు – 113
కాంగ్రెస్‌ – జేడీఎస్‌ – 118
బీజేపీ – 105
బీఎస్పీ›– 01
కాంగ్రెస్‌ – 79
జేడీఎస్‌ – 37
స్వతంత్య్రులు›2

జూలై 6వ తేదీ

మొత్తం – 212 మంది
కాంగ్రెస్‌ – జేడీఎస్‌ – 105
మ్యాజిక్‌ నంబర్‌ – 107
బీజేపీ – 107
బీఎస్పీ – 1
కాంగ్రెస్‌ – 70
జేడీఎస్‌ – 34
స్వతంత్రులు – 2

జూలై 8న

మొత్తం – 210 మంది
కాంగ్రెస్‌ – జేడీఎస్‌ – 105
మ్యాజిక్‌ నంబర్‌ – 106
బీజేపీ – 107
బీఎస్పీ – 1
కాంగ్రెస్‌ – 70
జేడీఎస్‌ – 34
స్వతంత్య్రులు – 2