Begin typing your search above and press return to search.
ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ... కేంద్రం కీలక ప్రకటన !
By: Tupaki Desk | 22 Sept 2020 7:00 PM ISTఆంధ్రప్రదేశ్ లో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆ ఎంపీ ప్రశ్నకి సమాధానం చెప్తూ సమాధానంగా కేంద్రం అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.