Begin typing your search above and press return to search.

నామ్ కే వాస్తీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్

By:  Tupaki Desk   |   2 April 2016 9:43 AM GMT
నామ్ కే వాస్తీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్
X
తెలుగు రాజకీయాలకు అడ్డాగా నిలిచి.. తెలుగు ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేసిన ఒక భవనం రానున్న రోజుల్లో నామ్ కే వాస్తీగా మారుతుందా? అంటే అవునని చెప్పక తప్పదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన అనంతరం కూడా పలు కీలక రాజకీయనిర్ణయాలకు వేదికగా ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇక గత వైభవానికి చిహ్నంగా మాత్రమే మిగులుతుందని చెప్పక తప్పదు.

విభజన నేపథ్యంలో హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించిన కార్యకలాపాలన్నీ విజయవాడకుషిఫ్ట్ అయిపోతున్న నేపథ్యంలో.. పార్టీ కార్యాలయంలో కూడా బెజవాడకు బదిలీ కానుంది. ఏపీ లోని టీడీపీ పార్టీ వ్యవహారాల కోసం మంగళగిరిలో పార్టీ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటివరకూ అక్కడ ఉన్న పార్టీ ప్రాంతీయ కార్యాలయం రానున్న రోజుల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంగా మార్చనున్నారు. ఈ నెల8న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని.. పార్టీ రాష్ట్ర కార్యకలాపాల్ని మంగళగిరిలోని పార్టీ ఆపీసు నుంచి నిర్వహించనున్నారు. తాజా షిఫ్టింగ్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలన్నీ మంగళగిరిలోని కార్యాలయానికే పరిమితం కానుండగా.. గడిచిన 35 ఏళ్లుగా రాజకీయాలకు ఎన్నో గురుతులకు సాక్షి అయిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒక చారిత్రక గురుతుగా మాత్రమే మిగిలిపోనుంది. తెలంగాణలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండనుండటంతో.. ఇప్పటి వరకున్న వెలుగుజిలుగులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు మిస్ అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.