Begin typing your search above and press return to search.
తెలంగాణలో పాఠ్యాంశంగా ఎన్టీఆర్ జీవితం
By: Tupaki Desk | 4 Sept 2020 2:00 PM ISTదేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తోన్న సమయంలో......ప్రాంతీయ పార్టీల ఉనికి పెద్దగా లేని రోజుల్లో...విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు....కాంగ్రెస్ కు వ్యతిరేకంగా `తెలుగు` దేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. `తెలుగు` వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పుట్టిన పార్టీ అంటూ సినీ `రాముడు` నందమూరి తారక రామారావు ప్రచారం చేయడంతో ఆనాడు టీడీపీకి ప్రజలు నీరాజనాలు పలికారు. ఉమ్మడి ఏపీలో తొలి ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీలో చేరి ఇపుడు తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలో కీలక నేతలుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని కేసీఆర్ అనేక సందర్భాల్లో చాటుకున్నారని టీడీపీ నేతలు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు. ఈ ఏడాది కొత్తగా రూపొందించిన సిలబస్‌లో 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను పొందుపరిచారు.
ఢిల్లీ పెద్దలు చేస్తున్న పనులు నచ్చక ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని, అప్పటికే సినిమా రంగంలో టాప్ హీరోగా ఎన్టీఆర్ ఉన్నారని ఆ పాఠ్యాంశంలో ఉంది.1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి తక్కువ కాలంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అందులో పేర్కొన్నారు. ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన రూ.2కే కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలను పొందుపరిచారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నిర్ణయంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసిస్తున్నారు. ఎన్టీఆర్‌పై అభిమానాన్ని కేసీఆర్ ఈ విధంగా చాటుకున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో అన్నగారి జీవితం పాఠ్యాంశంగా చేర్చడం ఆనందకరం అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టీడీపీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద అని, అక్కడ ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థని తొలగించింది రామారావు గారు అని ట్వీట్ చేశారు. ఇటు సినీరంగంలోనూ, అటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.