Begin typing your search above and press return to search.
హాట్ పిక్: వైసీపీ పార్టీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్
By: Tupaki Desk | 7 July 2020 6:00 PM ISTనాడు కుల్లు రాజకీయాలను ప్రజల్లోనే తేల్చుకునేవారు దివంగత ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్. నాదెండ్ల భాస్కర్ రావు మోసం చేసి టీడీపీని హైజాక్ చేసి సీఎం అయితే ఎన్టీఆర్ కృంగిపోలేదు. జనంలోనే తేల్చుకున్నారు. నేడు అదే రకమైన ఆవేశాన్ని ప్రస్తుత సీఎం జగన్ లో చూస్తున్నారు తెలుగు జనాలు. జగన్ కూడా పార్టీ మనుషుల కంటే.. కట్టబెట్టిన పదవుల కంటే జనాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు. ప్రతిపక్షం లో ఉండగా అసెంబ్లీ కి కూడా వెళ్లకుండా జనంలోనే ఉన్నారు. వాళ్ల మధ్యనే పంచాయితీ పెట్టుకుంటున్నారు. ఇప్పుడూ అంతే.. జనం లోకి వెళ్లి సమాధానాలు చెప్తుంటారు.
తెలుగు నేలపై దూకుడు, శరవేగంగా నిర్ణయాలకు ఎన్టీఆర్ ఆజ్యం పోస్తే.. దాన్ని జగన్ కంటిన్యూ చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతుంటారు. ఇలా చేయాలంటే దమ్ముతోపాటు అపరిమితమైన ప్రజాదరణ ఉండాలి. ఈ రెండూ నాడు ఎన్టీఆర్, నేడు జగన్ లో పుష్కలంగా ఉన్నాయంటారు.
అందుకే తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను వైసీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు. ఓన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తో జగన్ ను పోల్చి చూస్తున్నారు. తెలుగు నేలపై అద్భుతమైన పరిపాలనతో అలరించిన ఎన్టీఆర్ తోపాటు సంక్షేమ రాజ్యాన్ని సృష్టించిన వైఎస్ఆర్ ను జగన్ తో పోలుస్తున్నారు. ముగ్గురు ఏపీ చరిత్ర లో చిర స్థాయి గా నిలిచి పోతారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
తాజాగా ఏపీలో వైసీపీ నేతలు వేసిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంది.అందు లో సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ఆర్ లను ప్రముఖం గా పెట్టారు. సీఎం జగన్ తో పాటు స్థానిక నేతలు కూడా ఫ్లెక్సీ లో కనిపించారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జగన్ కు, వైఎస్ఆర్ సీపీ కి సపోర్టు చేస్తున్నారని అర్థమవుతోంది.