Begin typing your search above and press return to search.

కేసీఆర్ రికార్డు గురించి హరీశ్ రావు చెప్పిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   21 Jun 2021 3:16 AM GMT
కేసీఆర్ రికార్డు గురించి హరీశ్ రావు చెప్పిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్
X
అందరికి అన్ని సాధ్యం కావు. కానీ.. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త మినహాయింపుగా చెప్పాలి. ఏ రాజకీయ అధినేత జీవితంలో లేనన్ని ట్విస్టు కేసీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి. ఒక సాదాసీదా నేత కాస్తా.. తిరుగులేని అధినేతగా మారటమే కాదు.. ఎదురులేని పాలకుడిగా మారటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో కేసీఆర్ కు సాటి వచ్చే నాయకుడు మరొకరు ఉండరే చెప్పాలి.

తాజాగా సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎన్టీఆర్ కు ఆ రోజుల్లో కేసీఆర్ సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారని గుర్తు చేశారు.

అలాంటి కేసీఆరే ఈ రోజున స్వయంగా సిద్ధిపేట జిల్లాను తన చేతులుగా ఏర్పాటు చేయటమే కాదు.. కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించటం గొప్ప విషయంగా ఆయన చెప్పారు. నిజమే.. వినతిపత్రం ఇచ్చే స్థాయి నుంచి పాలకుడిగా తాను వినతిపత్రం ఇచ్చిన అంశాల్ని పూర్తి చేసిన ఘనత.. క్రెడిట్ కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని చెప్పాలి.