Begin typing your search above and press return to search.
ఎన్నారైలకు దేశంలో దిగగానే అనుకోని షాక్
By: Tupaki Desk | 15 May 2020 6:00 AM ISTఅసలే కరోనా-లాక్ డౌన్ తో విదేశాల్లో ఉపాధి పోయి.. ఉద్యోగాలు ఊడిపోయి అప్పులు చేసి ఇండియాకు వచ్చిన ఎన్నారైలకు దేశంలో అనుకోని షాక్ ఎదురైంది. వందే భారత్ మిషన్ లో భాగంగా కరోనా-లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకుపోయిన వారు దేశానికి విమానాల్లో వస్తున్నారు. ఎన్నారైలు కదా.. ఎలాగూ బాగా సంపాదించి ఉంటారని యూపీ ప్రభుత్వం భారీ చార్జీలు విధించింది. దీంతో ఎయిర్ పోర్టు నుంచి ఇళ్లకు వెళ్లాలనుకునే వారు ట్యాక్సీల చార్జీలు చూసి షాక్ అయ్యారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్ లోని 250కి.మీల పరిధిలోని ప్రాంతాలకు వెళ్లే ట్యాక్సీలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) ఏకంగా భారీ మొత్తంలో చార్జీలు వేసింది. ఏకంగా 10వేల నుంచి రూ.12వేలుగా ట్యాక్సీల ధర నిర్ణయించింది. ఢిల్లీకి ఆనుకొని ఉండే నోయిడా, ఘజియాబాద్ లకు వెళ్లే క్యాబ్ లకు ఇదే రేట్ ను యూపీఎస్ఆర్టీసీ వసూలు చేసింది.
దీంతో ఎన్నారైల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మీడియాలోనూ యూపీ ప్రభుత్వం దోపిడీపై విరుచుకుపడ్డారు. దీంతో వెంటనే చార్జీలను పున: సమీక్షిస్తున్నట్టు యూపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
ఢిల్లీ విమానాశ్రయం నుంచి యూపీలోని క్వారంటైన్ కేంద్రాలకు తాము నడిపే సర్వీసులు పూర్తి ఉచితమని.. ట్యాక్సీ సేవల కోసం చార్జీలను పున: సమీక్షిస్తామని యూపీఎస్ఆర్టీసీ తెలిపింది. దీంతో ఈ చార్జీల వేడి నుంచి ఎన్నారైలకు కాస్త ఉపశమనం కలిగింది.