Begin typing your search above and press return to search.

ఎన్నారైకి 56 నెలల జైలు శిక్ష .. ఏం చేశాడంటే ?

By:  Tupaki Desk   |   20 May 2021 3:56 AM GMT
ఎన్నారైకి 56 నెలల జైలు శిక్ష .. ఏం చేశాడంటే ?
X
ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా ఆడవారి పై మగవారు ఆధిపత్యం చూపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఎక్కువగా చదువుకున్న వారే ఉండటం గమనార్హం. తాజాగా ఓ ఎన్నారై భార్య పై వేధింపులకు పాల్పడటం తో కోర్టు అతనికి 56 నెలల శిక్ష విధించింది. అలాగే ,శిక్షా కాలం పూర్తి అయిన తర్వాత , విడుదలైన తర్వాత కూడా మూడేళ్లపాటు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు. పోలీసుల కథనం ప్రకారం.. 2019 ఆగస్ట్ 6వ తేదీన సునీల్ టెక్సాస్ లోని తన ఇంటి నుంచి అగ్వాం వెళ్ళాడు. అక్కడ ఉన్న తన భార్యను బెదిరించి, తనతో పాటు టెక్సాస్ వచ్చేయాలని కోరాడు. ఆమెను తన అపార్ట్ మెంట్ నుంచి వచ్చి కారు ఎక్కమనీ.. తనతో టెక్సాస్ వచ్చేయమనీ బలవంతం చేశాడు.

ఆ తర్వాత బలవంతంగా తన కారులో ఎక్కించుకుని టెక్సాస్ బయలు దేరాడు. అక్కడ నుంచి నేరుగా టెక్సాస్ పోకుండా.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కారును తిప్పుతూ ఆమెను వేధిస్తూ వచ్చాడు. తరువాత ఆమెను కారులోనే కొట్టి, తన ఉద్యోగానికి రాజీనామా చేయమని వేధించాడు. ఆమెను వెంటనే తన కంపెనీకి రిజిగ్నేషన్ ఈ మెయిల్ చేయమని గొడవ చేశాడు. తరువాత ఆమె లాప్ టాప్ ను ధ్వంసం చేసి కారులోంచి బయటకు హైవే పైకి విసిరేశాడు. అక్కడి నుంచి టెక్సాస్‌లోని ఒక హోటల్‌కు తీసుకొచ్చి అక్కడ కూడా ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ హోటల్ నుంచి బయటకు వెళ్లబోతుండగా స్థానిక పోలీసులు సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో ఉండగా భారత్‌లోని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన సునీల్.. భార్య కేసు వెనక్కు తీసుకునేలా మాట్లాడాలంటూ ఆమె కుటుంబీకులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలు అన్నీ రుజువు కావడంతో సునీల్ ఆకుల కు 56 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు.. శిక్షాకాలం పూర్తయిన మూడేళ్లపాటు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు.