Begin typing your search above and press return to search.
సౌదీలో తెలుగోడికి ప్రాణాపాయం..ప్రత్యేక విమానంలో..!
By: Tupaki Desk | 22 Aug 2019 4:16 PM ISTఓవైపు నిబంధనలు...మరోవైపు ఆరోగ్య సమస్యలు...ఇలా దేశం కాని దేశంలో ప్రాణాపాయ స్థితికి చేరిన తెలుగోడిని అనూహ్య రీతిలో స్వదేశానికి తీసుకువచ్చారు. ప్రత్యేక చార్టర్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆయన్ను స్వదేశానికి చేర్చారు. ఈ కష్టకాలంలో ఓ సామాజికవేత్త వారికి సహాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే - కాకినాడకు చెందిన వ్యాపారి సీవీఎస్ నారాయణ కూతురు - అల్లుడు సౌదీ అరేబియాలో నివసిస్తుంటారు. రెండు నెలల క్రితం సౌదీ అరేబియా వచ్చిన నారాయణకు హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రియాద్ లోని ఓ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించసాగింది. దీంతో స్వదేశానికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే, నారాయణ ప్రయాణించే స్థితిలో లేడు. మరోవైపు ఆయన వీసా గడువు ముగుస్తోంది. వీసా తీసుకునేందుకు తగు సమయం కూడా లేదు.
ఇలా ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో - సామాజిక కార్యకర్త షిహాబ్ కొట్టుకాడ్ ను సంప్రదించారు. ఆ కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం వారంతా కలిసి ఓ ప్రత్యేక చార్టర్ ఎయిర్ క్రాఫ్ట్ అద్దెకు తీసుకొని దానిలో నారాయణను ఆయన స్వదేశానికి చేర్చారు. రియాద్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి నారాయణ - ఆయన కుటుంబ సభ్యులను తీసుకువచ్చేందుకు ఎయిర్ క్రాఫ్ట్‌కు రూ. 50 లక్షల ఖర్చు అయింది.