Begin typing your search above and press return to search.
రండి బాబు.. రండి: రూ.86 లకే సొంతిల్లు !
By: Tupaki Desk | 28 Oct 2020 5:20 PM ISTసొంతిల్లు ప్రతిఒక్కరి జీవిత కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఎందరో ఎన్నెన్నో కష్టాలు పడుతుంటరు. నెలనెలా తమ సంపాదనలో నుంచి కొంత సొమ్ము దాచిపెట్టి, చిట్టీలు కట్టి, బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తుంటరు. కిరాయి ఇంట్లో ఉండి నెలనెలా రెంట్ కట్టే బదులు.. ఓ ఇల్లు కొనుక్కొ ని దాని ఈఎంఐ కట్టడమే బెటర్ అనుకుంటరు. నిజానికి ఇది చాలా మంచి ఆలోచనే. కానీ ముందువెనక ఆలోచించకుండా ఇల్లు కొనేసి, దాని ఈఎంఐ కట్టలేక అవస్థలు పడేవారు కూడా చాలామందే ఉంటారు. చివరకు అంతవరకు కట్టిన డబ్బులు, ఇల్లును వదిలేసి వెళ్లిపోయినవారు కూడా ఎంతో మంది. అయితే ఏదేదో రూ. 86 కే ఇల్లు అంటే ..ఇలాంటి వారి కోరికలు అన్ని కూడా తీరిపోతాయి కదా !
అయితే , ఓ ఇల్లు కట్టాలంటే ప్రస్తుతం లక్షల్లో వ్యవహారం.అయినా కూడా అంత తక్కువ ధరకి ఇల్లు ఇస్తున్నారు అంటే దానివెనుక ఉన్న మర్మం ఏమిటో కూడా కనుక్కొని ముందుకు దిగాలి. ఆ విషయాన్ని చూస్తే .. ఇటలీలోని సిసిలీ ద్వీపంలో సంబూకా అనే విలేజ్ ఉంది. మనంచెప్పుకుంటున్న 86 రూపాయలకే ఇల్లు దొరికేది ఈ ఊర్లోనే . ఎందుకంటే ఈ ఊళ్లో ఉన్నోళ్లంతా బతుకుదెరువుకోసం నగరాలకు వెళ్లిపోయిన్రట. దీంతో ఈ ఊరు మొత్తం ఇప్పుడు ఖాళీ అయ్యింది. యూరప్ లోని చిన్న చిన్న పట్టణాలు, ఊర్లు చాలానే ఖాళీ అవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం పల్లెలను మళ్లీ ప్రజలతో నింపేందుకు కొత్త పథకాన్ని ప్రకటించింది. అందే ‘ఒక్క యూరోకే ఇల్లు ’ పథకం. అంటే ఒక్క యూరో మన రూపాయాల్లో దాదాపు 86 రూపాయలతో సమానం. ప్రస్తుతం ఆ ఊర్లో చాలా ఇల్లులు శిధిలవ్యవస్థకి చేరుకున్నాయి. ఇటలీకి చెందినవారే ఇక్కడ ఇండ్లను కొనుక్కోవాలని ఏమీ లేదు. ప్రపంచంలో ఏ దేశానికి చెందినవారైనా ఇక్కడ ఇండ్లను కొనుక్కోవచ్చు. సంబూకాలోని నివసించవచ్చు. అయితే ఓ కండిషన్ ..! ఇల్లు కొనుక్కున్నవారు మూడేళ్లలోగా దానికి రిపేర్లు చేయించుకోవాలి. రంగులు వేయించుకోవాలి.
నిజానికి సంబూకా గ్రామం సిసిలీ ద్వీపంలోనే అందమైన ఊరు. దీనిని టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తే ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తరని చెబుతున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం, గ్రామ పాలక సంస్థ ఆ దిశగా ఆలోచించకపోవడంతోనే ఊరు మొత్తం మొండిగోడలతో మిగిలే పరిస్థితి తలెత్తిందని చెబుతున్నరు. ఇప్పటికైనా మంచి టూరిస్ట్ ప్లేస్ గా తీర్చి దిద్దాలని అక్కడ ఇండ్లు కొన్నవారు కోరుతున్నారు.