Begin typing your search above and press return to search.

ఇపుడు ఆర్బీఐ బటన్ నొక్కింది...బిగ్ ట్రబుల్ లో జగన్ సర్కార్!

By:  Tupaki Desk   |   13 Dec 2022 11:30 AM GMT
ఇపుడు ఆర్బీఐ బటన్ నొక్కింది...బిగ్ ట్రబుల్ లో జగన్ సర్కార్!
X
బటన్ నొక్కుడుతోనే ఏపీ ఆర్ధిక వ్యవస్థ దివాళా తీస్తోందా. లేక ఏపీకి ఆదాయం లేకపోవడం వల్లనా. ఏపీలో సంపద కొత్తగా సృష్టి చేసుకోలేకపోవడం వల్ల కూడా ఆర్ధిక దిగ్బంధనంలో కూరుకుపోతోందా. నిజానికి ఇవన్నీ కారణాలే. ఏపీలో ఆర్ధిక పరిస్థితి రెడ్ సిగ్నల్ చూపించడం ఏనాడో జరిగిపోయింది. అదే విధంగా ఏపీ అప్పుల అంచున ఉంది, ఆర్ధికంగా పెను సవాల్ ని ఎదుర్కొంటోంది.

ఇక ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థ్తిని ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంది. దీని వెనక కారణాలు ఏంటి అంటే ఆర్బీఐ అక్కడ బటన్ నొక్కిందట. అవును ఏపీ ఆర్ధిక పరిస్థితిపైన పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.

దాని ప్రకారం చూస్తే రాష్ట్రం రుణ పరిమితులను దాటినపుడు సెంట్రల్ బ్యాంక్ బ్యాంకర్ గా వ్యవహరిస్తుంది. అపుడు రుణాలు ఇతర ఆర్ధిక విషయాలు అన్నీ కూడా హోల్డ్ లో పెడతారు. ఏపీ విషయంలో అదే జరిగింది. అందుకే ఏపీ ఇపుడు బిగ్ ట్రబుల్ లో పడింది అని అంటున్నారు

ఆర్బీఐ నిబంధనల ప్రకరం చూస్తే వరసగా అయిదు పని దినాలలో రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ లో ఉంటే సెంట్రల్ బ్యాంక్ ఆర్ధిక సహాయాన్ని నిలిపివేస్తుంది. ఆ విధంగా చూస్తే ఆర్బీఐ ఫోకస్ పెట్టిన మేరకు ఏపీ వరసగా పధ్నాలుగు పని దినాలలలో ఓడిలో ఉందిట. అదే విధంగా ఈ నెల మోటి రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకూ చూస్తే ఏడు పని దినాలు ఇందులో ఉన్నాయట. దాంతో పాటు ఈ ఆర్ధిక సంవత్సరం త్రైమాసికంలో రాష్ట్రం ఏకంగా 19 రోజుల పాటు ఓడీలో ఉంది.

ఇవన్నీఎ పూర్తి స్థాయిలో గమనించిన మీదటనే సెంట్రల్ బ్యాంక్ రుణాల విషయంలో ఏపీని హోల్డ్ లో పెట్టింది. దాంతో జీతాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి అని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే ఈ నెల 9న రిజర్వ్ బ్యాంక్ జనరల్ మేనేజార్ ఏపీ ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాసినట్లుగా మీడియాకు సమాచారం లీక్ అయింది.

దానిలో చూతే ఏపీ ప్రత్యేక ముసాయిదా నిబంధనలను పూర్తిగా మించిపోయిందని, దాంతోనే ఏపీ తన ఉద్యోగులకు జీతాలు చెల్లించ లేదని పేర్కొందిట. ఇదే పరిస్థ్తితి కొనసాగితే రాష్ట్ర తీవ్రాతితీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని పోతుందని అది ఆర్ధిక గందరగోళానికి దారి తీస్తుందని కూడా హెచ్చరించిందిట.

అయితే అఫీషియిల్ గా ఈ మ్యాటర్ ఎవరూ చెప్పలేదు. మీడియాకు లెటర్ లీక్ అయింది అని వార్తలు వస్తున్నాయి. దాంతో ఎవరూ ఈ విషయం మీద ప్రభుత్వం తరఫున ఏ రకమైన కామెంట్స్ చేయడం లేదు. ఇదిలా ఉంటే ఏపీలో బటన్ నొక్కి సక్షేమ పథకాలు జగన్ నగదు రూపంలో చెల్లింపులు చేస్తూ వస్తున్నారు.

ఏపీలో అనేక ప్రతిష్టాత్మకమైన పధకాలు అమలు అవుతున్నాయి. దాంతో ఏపీలో ఆర్ధిక వ్యవహారాలు కుదుటన పడడంలేదు అన్న చర్చ అయితే ఉంది. ఇక ఆర్బీఐ ఎపుడూ ఇదే విషయంలో హెచ్చరిస్తూ వస్తోంది అని అంటున్నారు. ఇపుడు కూడా మరో మారు హెచ్చరించింది. కానీ ప్రభుత్వం ఆర్ధిక నిర్వహణ ఏలా మార్చుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.