Begin typing your search above and press return to search.
ట్రాఫిక్ పోలీసులను చూసి ఇకపై కంగారు వద్దు!
By: Tupaki Desk | 6 Sept 2016 11:43 AM ISTబైక్ పై హుషారుగా వెళ్లిపోతున్న సమయంలో సడన్ గా రోడ్డుపై వైట్ అండ్ వైట్ లో ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తారు. అంతే.. ఉన్నట్లుండి బాడీలో అసంకల్పిత ప్రతీకార చర్య ఒకటి జరిగిపోతుంది. పాకెట్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా - ఆర్ సీ - సీబుక్ ఇవన్నీ ఉన్నాయా లేదా? లేకపోతే లక్ష్మీదేవి జారిపోతుంది.. ఆ వైట్ అండ్ వైటి చేతిలో పడిపోతుంది. అలవాటులేనివాళ్లైతే.. ఈ టెన్షన్స్ మధ్యలో ఏ డివైడర్ కో - పక్కనున్న వాహనానికో - వెనకనున్న బండికో డ్యాష్ ఇచ్చేస్తారు. అయితే ఇకపై అలాంటి టెన్షన్స్ ఏమీ వద్దంటుంది "డీజీ లాకర్".
తరచూ డ్రైవింగ్ లైసెన్స్ - రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లను మర్చిపోయి బయటకు వెళ్లి ఇబ్బందులు పడే సమస్య ఇకపై ఉండదు! దీనికోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో "డిజీ లాకర్" అనే యాప్ ను ప్రవేశపెట్టనుంది. ఈ యాప్ ద్వారా ఏ ప్రాంతం నుంచి అయినా మొబైల్ ను ఉపయోగించి బండి కాగితాలను చూసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు - వాహనాలతో ప్రమేయం ఉన్న వేరే కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులూ ఈ యాప్ ద్వారా వ్యక్తుల వివరాలను కూడా తెలుసుకోవచ్చట.
ఒకటి రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ "డిజీ లాకర్" యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను మొబైల్ నంబర్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ యాప్ ను ఐటీ - రవాణా శాఖల మంత్రులు త్వరలోనే విడుదల చేయనున్నారు.