Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ‘కరోనా’ కల్లోలం

By:  Tupaki Desk   |   5 March 2020 6:00 AM GMT
హైదరాబాద్ లో ‘కరోనా’ కల్లోలం
X
ఇన్నాళ్లు హైదరాబాద్ అంటే తెలుగు వారి కలల నగరం. ఏపీ , తెలంగాణ వాసులంతా ఇక్కడే సెటిల్ అయ్యి ఈ మెట్రో పాలిటన్ సిటీపై ప్రేమ పెంచుకున్నారు. కానీ ఇప్పుడు వారంతా సిటీని వదిలి గ్రామాలకు పారిపోతున్నారు. కారణం ‘కరోనా వైరస్’.

కరోనా వైరస్ హైదరాబాద్ వచ్చేసింది. దీంతో హైదరాబాదీలు ఉలిక్కిపడుతున్నారు. ఐటీ పరిశ్రమ హడలి చస్తోంది. ఉద్యోగులు ఈ సిటీ సేఫేనా అని బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. సోషల్ మీడియాలోనైతే ఇంకా భయాలు ఎక్కువైపోయాయి. జనమంతా మాస్కుల్లోనే ఉంటున్నారు.

ఇక కరోనా భయంతో స్కూళ్లకు సెలవులిస్తున్నారు. కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్లు, బస్సులు, రైళ్లలో మాస్కులు ధరించే కనిపిస్తున్నారు. ఎవరైనా తుమ్మినా, దగ్గినా బాంబు పేలిన చందంగా పారిపోతున్నారు.. కరోనా భయం ఇప్పుడు హైదరాబాద్ ను వెంటాడుతోంది.

తాజాగా మాదాపూర్ , హైటెక్ సిటీ ఉద్యోగులు కరోనా భయంతో ఉలిక్కిపడుతున్నారు. మాదాపూర్ లోని మైండ్ స్పేస్ బిల్డింగ్ నంబర్ 20లో డీసీఎం కంపెనీలో పరిమళ అనే ఐటీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆమెతో పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులంతా అప్రమత్తమయ్యారు. పరీక్షలు చేయించుకున్నారు. కంపెనీ మూసివేసి వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించింది. దీంతో కంపెనీ మొత్తం బోసిపోయింది. ఐటీ రంగం మొత్తంపై ఈ ప్రభావం పడింది.

జనాల్లో ఉండాల్సిన పోలీసులు, ఆటో డ్రైవర్లు, కంపౌండర్లు, నర్సులు, వీధి వ్యాపారులు ట్రాఫిక్ పోలీసులు ముఖానికి మాస్కులతో కనిపిస్తున్నారు. హోటల్స్ లో కూడా ఇదే పరిస్థితి. ఇక హైదరాబాద్ లో తలపెట్టిన వివిధ షోలు, కార్యక్రమాలు, కంపెనీల మీటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి.

ప్రముఖ హీరోయిన్ కాజల్ తాజాగా స్పందించారు. ప్రజలంతా శుభ్రత పాటించాలని.. బయట మాస్కులు ధరించాలని సూచించారు.

కరోనా వ్యాపించడంతో ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో 50 పడకల ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు.