Begin typing your search above and press return to search.

ఇప్పుడు బాయ్ కాట్ అమెజాన్.. ఎందుకిలా అంటే?

By:  Tupaki Desk   |   20 Aug 2022 6:44 AM GMT
ఇప్పుడు బాయ్ కాట్ అమెజాన్.. ఎందుకిలా అంటే?
X
రంగం ఏదైనా కాస్తంత తేడా వచ్చినా తెర మీదకు వస్తున్న నినాదం.. 'బాయ్ కాట్'. ఈ మాటతో జరిగే నష్టం ఎంతన్న విషయం తాజాగా బాలీవుడ్ కు బాగానే అర్థమైంది. గతంలో బాయ్ కాట్ మాట విన్నంతనే లైట్ తీసుకునే దానికి భిన్నంగా.. ఇప్పుడు తీరు మారింది.గతంలో కాసింత ఎటకారంతో మా సినిమాను బాయ్ కాట్ చేయండన్న మాటను అలోవకగా చెప్పే సినీ ప్రముఖులకు.. ఇప్పుడు మాత్రం వణికిపోతున్నారు. తొందరపడి బాయ్ కాట్ మాట నోటి నుంచి వస్తే.. దాని ప్రభావం ఏ మాత్రం తమ మీద పడినా అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉండటమే దీనికి కారణం.

బాయ్ కాట్ నినాదం దెబ్బకు అమీర్ ఖాన్ తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయానికి గురి కావటం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి డిజాస్టర్ కు బాయ్ కాట్ నినాదం కీ రోల్ ప్లే చేసిందనటంలో సందేహం లేదు. వేర్వేరు కారణాలతో బాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు ఇప్పుడు 'బాయ్ కాట్' ను ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా బాయ్ కాట్ అమెజాన్ కొత్త నినాదం పాపులర్ అవుతోంది. దీనికి కారణం.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీయటమే అని చెబుతున్నారు.

వ్యాపారం చేసుకునే వాడికి ఆ మాత్రం బుద్ది బుర్ర ఉండదా? చూస్తూ.. చూస్తూ కొరివి తల గీరుతారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. అనుకోకుండా జరిగే తప్పులతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరో కీలకమైన అంశం.. ఇటీవల కాలంలో సున్నితత్వం అంతకంతకూ పెరుగుతోంది. గతంలో ఏమైనా మాటను ఇట్టే అనేసే వారు. కానీ.. ఇప్పుడు అలాంటి మాటల్ని అండర్ లైన్ చేసుకొని విరుచుకుపడితే జరిగే నష్టాన్ని ముందుగా గుర్తించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

అమెజాన్ విషయానికి వస్తే.. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అభ్యంతరకరంగా ఉండే ఫోటోల్ని అమ్మకానికి పెట్టటమే అని చెబుతున్నారు. ఈ ఇష్యూలో అమెజాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని.. ప్రేమను అవమానించేలా ఉన్న అసభ్య చిత్రాల్ని అమ్మేందుకు తమ ప్లాట్ ఫాం మీద ఎందుకు అవకాశం ఇస్తారన్న ప్రశ్నను సంధిస్తున్నారు. షేమ్ ఆన్ యూ అంటూ అమెజాన్ మీద మండిపడుతూ.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. జన్మాష్టమి సందర్భంగా 20 శాతం డిస్కౌంట్ సేల్ అంటూ కొన్ని చిత్రాల్ని అమ్మకాలకు పెట్టింది ఎక్సోటిక్ ఇండియా. అయితే..

ఈ చిత్రాలు రాధాకృష్ణుల బంధాన్ని తప్పుగా చూపించేలా ఉండటాన్ని హిందూ సంస్థలు తప్పు పడుతున్నాయి. హిందూ దేవతలపై అనుచితంగా వ్యవహరించటం ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిన తప్పు పడుతున్నాయి. మరి.. తాజా ఎపిసోడ్ లో అమెజాన్ క్షమాపణలు చెబుతుందా? లేదా? అన్నది చూడాలి.