Begin typing your search above and press return to search.
ఆ 5 రాష్ట్రాలతో పాటే తిరుపతి ఉప ఎన్నికకి నోటిఫికేషన్!
By: Tupaki Desk | 11 Feb 2021 7:03 PM ISTదేశంలో త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరో వారం , పదిరోజుల్లోనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ ఐదు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల వ్యూహాలని సిద్ధం చేసుకుంటూ , ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లని ఆకట్టుకోవడానికి ఇప్పటికే తమ వాగ్ధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 15 తర్వాత కానీ లేదా 20వ తేదీ తర్వాత కానీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉందట. ఇక ఏపీలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు తమ కసరత్తును నెలలుగా కొనసాగిస్తూ ఉన్నాయి. బహుశా ఉప ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడినట్టు అనిపిస్తుంది. ఇంతలోపే పలు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో వాటితో పాటే, తిరుపతి బై పోల్ కు కూడా తేదీ ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక ప్రక్రియకు సంబంధించి రిటర్నింగ్ అధికారి నియామకం కూడా జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి.