Begin typing your search above and press return to search.

అవునండి.. మీ ఆయుష్షును పెంచటంలో శృంగారం 'కీ' రోల్

By:  Tupaki Desk   |   16 Dec 2021 2:02 AM GMT
అవునండి.. మీ ఆయుష్షును పెంచటంలో శృంగారం కీ రోల్
X
మనిషికి ప్రాణం కంటే తీపి మరొకటి ఉండదు. ఎవరెన్ని మాటలు చెప్పినా.. ఎంత కాలం బతికినా.. అవకాశం ఉంటే మరికొంత కాలం ఈ భూమ్మీద బతకాలన్న ఆశ లేనిదెవరికి? లైఫ్ లైన్ పెరగాలంటే ఏం చేయాలన్న ఆసక్తి కోట్లాది మందికి ఉంటుంది.

మరేం చేయాలన్నంతనే.. తక్కువ ఆహారం తీసుకోవటం.. కంటి నిండా నిద్రపోవటం.. కొవ్వు.. కేలరీలు తక్కువగా ఉండే తిండి తినటం.. వ్యాయామం చేయటం.. చెడు అలవాట్లు లేకపోవటం లాంటివి చెబుతారు. కానీ.. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన శృంగారం కూడా క్రమం తప్పకుండా చేయాలన్న మాటను చాలామంది చెప్పరు. పరిమిత మోతాదులో చేసే శృంగారం.. మనిషి ఆయుష్షును పెంచుతుందన్న విషయం తాజా అధ్యయనంలో మరోసారి నిరూపితమైందని చెబుతున్నారు.

వైక్స్ వర్సిటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో శృంగారం కీలక భూమిక పోషిస్తుందని గుర్తించారు. వారానికి ఒకటి కంటే తక్కువసార్లు శృంగారం చేసే వారితో పోలిస్తే.. వారానికి రెండుసార్లు.. అంతకంటే ఎక్కువ సార్లు శృంగారం చేసే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వారానికి రెండుసార్లు సెక్సు చేసే వారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ మోతాదులు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు.

సరైన ఆహార అలవాట్లు.. వ్యసనాలకు దూరంగా ఉంటూ.. మోతాదు మించని రీతిలో శృంగారం చేసే వారు.. తమ ఆయుష్షును మరో 20 ఏళ్లకు పొడిగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం ఎలా అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందో.. తరచూ శృంగారం చేసినప్పుడు కూడా రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుందని చెబుతున్నారు. మరి శృంగారం చేయటానికి అనువుగా హార్మోన్లను పెంచుకోవటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు.

సోయా.. చేపలు లాంటివి సెక్సు హార్మోన్ల మోతాదును పెంచేలా చేస్తాయని.. పలుచటి ప్రోటీన్లతో కూడిన కోడి మాంసంలో ఉండే టైరోసైన్.. ఫినైల్ అలనైస్ లు శృంగార ఆసక్తిని పెంచేలా చేస్తాయని చెబుతున్నారు. పండ్లు.. పొట్టు తీయని ధాన్యాలు.. ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో ఉండే గ్లుటమైన్.. ఐనోసిటాల్ లు కూడా సెక్సు లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు సాయం చేస్తాయని చెబుతున్నారు. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండేందుకు అవసరమైన రసాయనాలు వీటి నుంచే పుట్టుకు వస్తాయని చెబుతున్నారు. సో.. సెక్సు లైఫ్ ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మనిషి ఆయుష్షు అంత బాగా ఉంటుందన్న మాట.