Begin typing your search above and press return to search.
ఆదేశాల సీఎం కాదు..గొడుగు తో మురికి నీటిలో పర్యటన - ప్రతిపక్షాలకి నో ఆప్షన్!
By: Tupaki Desk | 27 Nov 2020 4:40 PM ISTముఖ్యమంత్రి .. ఆ స్థానంలో ఉండే వారికి ఎన్నో భాద్యతలు , బరువులు ఉంటాయి. రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా కూడా ఆ ఎఫెక్ట్ సీఎం పై పడుతుంది. ఎక్కడో , ఎవరో చేసిన ఓ చిన్న తప్పుకి ప్రతిపక్షాలు సీఎం ను టార్గెట్ గా చేసుకొని కామెంట్స్ చేస్తారు. అయితే , ఏదైనా విపత్తు వచ్చిన సమయంలో వెంటనే సీఎం అంతటి వ్యక్తి అక్కడికి రాకుండా , అధికారులతో ఆ సమస్యల్ని పరిష్కరించి , ఆ తర్వాత వీలుచూసుకొని ఆ ప్రాంతానికి వెళ్తారు. కానీ, తమిళనాడు సీఎం మాత్రం అధికారులని , మంత్రులని కాదని ఏకంగా ఓ పెద్ద గొడుగు చేపట్టి స్వయంగా రంగంలోకి దిగి వరద ముప్పు ప్రాంతాలకు వెళ్లి మురికినీటిలో నడుస్తూ సహాయక చర్యల గురించి ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు లో నివర్ తుపాన్ బీభత్సం సృష్టిస్తుంది.
నివర్ తుపాను దెబ్బతో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా సీఎం పళనిస్వామి జాగ్రత్త పడ్డారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా సీఎం పళనిస్వామి సాటి మంత్రులు, నాయకుల మీద ఆధారపడకుండా ఆయనే రంగంలోకి దిగి సూపర్ సీఎంగా అవతరించారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ పీక్స్ లో ఉన్న సమయంలో కరోనాను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అంటూ ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇదే సమయంలో తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి కే. విజయ్ భాస్కర్ పై సీఎం ఎడప్పాడి పళనిస్వామి అసహనం వ్యక్తం చేశారని వెలుగు చూసింది.
ఇంకా కరోనా పూర్తిగా తగ్గిపోకమునుపే నివర్ తుపాను విరుచుకుపడటంతో చెన్నై సిటీలో అంటువ్యాధులు వ్యాపించకుండా సీఎం ఎడప్పాడి పళనిస్వామి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరోగ్య శాఖ - రెవెన్యూ - మునిసిపాలిటి - కార్పోరేషన్ - అగ్నిమాపక - రెస్యూ సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులు - సిబ్బందిని రంగంలోకి దింపి అంటు వ్యాధులు వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం ఎడప్పాడి పళనిస్వామి స్వయంగా సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి ఆయనే నిర్ణయాలు తీసుకున్నారు. నివర్ తుపాను దెబ్బ చెన్నై ప్రజల మీద పడకుండా అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం చెయ్యడంతో తమిళనాడు ప్రభుత్వం సక్సస్ అయ్యింది. నివర్ తుపాను లెక్కచెయ్యకుండా చెన్నైలోని సెంబారబాక్కంతో పాటు అనేక ప్రాంతంలో ప్రత్యక్షం అయ్యారు. భారీ వర్షం పడుతున్నా లెక్కచెయ్యని సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆయనే స్వయంగా చేతిలో పెద్ద గొడుగు పట్టుకుని ప్రజల ముందుకు వెళ్లి వారికి సహాయక చర్యలు అందుతున్నాయా - తుపాను దెబ్బకు ఏమైనా ఇబ్బందులు ఎదురౌతున్నాయా, మీ సమస్యలపై సంబంధిత అధికారులు ఎలా స్పంధిస్తున్నారు, అంటూ ఆరా తీసి వివరాలు సేకరించారు. కరోనా వైరస్ సమయంలో తీవ్రస్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు నివర్ తుపాను విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చెయ్యకుండా సీఎం ఎడప్పాడి పళనిస్వామి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో ప్రతిపక్షాలకి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఛాన్స్ లేకుండా పోయింది,