Begin typing your search above and press return to search.

టాయిలెట్లు కడగడానికా గెలిచింది.?

By:  Tupaki Desk   |   22 July 2019 7:13 AM GMT
టాయిలెట్లు కడగడానికా గెలిచింది.?
X
ప్రగ్యాసింగ్.. మొన్నటి ఎన్నికల వేళ వివాదాస్పద అంశాలతో దేశవ్యాప్తంగా దుమారం రేపిన బీజేపీ ఎంపీ ఈమె. ప్రధాని మోడీ, అమిత్ షా కూడా ఈమె మాట్లాడిన హిందుత్వ అనుకూల వ్యాఖ్యల్ని అప్పట్లో ఖండించారు. తాజాగా మరోసారి తన దుందుడుకు స్వభావాన్ని ప్రగ్యాసింగ్ బయటపెట్టారు.

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని భోఫాల్ ఎంపీగా గెలిచారామే.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్ ’ కార్యక్రమంలో ఆమె పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారమే.. ‘టాయిలెట్లు కడగడానికి నేను గెలవలేదు.. అర్థమైందా’ అంటూ బీజేపీ కార్యకర్తలపై రుసరుసలాడాడు.

ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చీపురు పట్టుకొని స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు అదే పార్టీ ఎంపీ స్వచ్ఛత పనిపై ఇలా బాధ్యతాయుతంగా మాట్లాడడం దుమారం రేపుతోంది.

టాయిలెట్లు కడగడానికి డ్రైనేజీలు శుభ్రం చేయడానికి నేను ఎన్నిక కాలేదని ప్రగ్యాసింగ్ అన్న మాటలు వివాదాస్పదమయ్యాయి. నా పని ఎమ్మెల్యేలను, అధికారులను సమన్వయం చేసి పనిచేయించడం.. అభివృద్ధిపై ప్రణాళికలు రచించడమేనని ఆమె కార్యకర్తలతో స్పష్టం చేశారు. మీ సమస్యలను స్థానిక నేతలు చెప్పుకోండి.. వాళ్లు వినకపోతే నాకు ఫోన్ చేయండని ఆమె దురుసుగా మాట్లాడారు.

ఇలా బీజేపీ ఎంపీ స్వచ్ఛత విషయంలో ఇంతటి దారుణ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకునపెట్టాయి. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు.