Begin typing your search above and press return to search.

ఊరందరికీ ఒక దారయితే వాళ్ళది మరో దారి

By:  Tupaki Desk   |   22 Sept 2016 5:24 PM IST
ఊరందరికీ ఒక దారయితే వాళ్ళది మరో దారి
X
ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. అంతా ఆన్ లైనే. ఇల్లు కదలకుండా అన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు. ప్రతి దానికీ వెబ్ సైటే. ప్రపంచవ్యాప్తంగా కోట్లసంఖ్యలో వెబ్ సైట్లున్నాయి. ఒక్క అమెరికాలోనే 80,818,367 వెబ్ సైట్లు పనిచేస్తున్నాయి. ఇండియా కూడా తక్కువేమీ కాదు. జనాభా, కమ్యూనికేషన్ల వ్యవస్థ విస్తారంగా ఉన్న దేశాల్లో వెబ్ సైట్లు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి. ఇంటర్నెట్ ప్రపంచం ఇంతగా విస్తరించినా కూడా కొన్ని దేశాలు మాత్రం దానికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. అందుకు ఉదాహరణ.. ఉత్తర కొరియా. ఆ దేశంలో కేవలం 28 వెబ్ సైట్లు మాత్రమే ఉన్నాయట. ప్రపంచమంతా దాదాపుగా వెలేసిన ఆ ప్రమాదకర దేశంలో అంతా అధ్యక్షుడి ఇష్టారాజ్యమే. అలాంటి దేశంలో కేవలం 28 వెబ్ సైట్లు మాత్రమే ఉన్నాయని స్వయంగా వారే ప్రకటించుకోవడంతో ప్రపంచం ఇప్పుడు ఆశ్చర్యపోతోంది.

ఉత్తరకొరియా దేశపు కోడ్ తో ఉన్న డొమైన్ నేమ్ లు కేవలం 28 మాత్రమే ఉన్నాయట. అవన్నీ 'డాట్ కేపీ' డొమైన్ తో ముగుస్తాయి. హైదరాబాద్ వంటి నగరంలోనే వేల సంఖ్యలో వెబ్ సైట్లున్నాయి. అలాంటిది ఉత్తర కొరియాకు కేవలం 28 మాత్రమే ఉండడంతో ఆన్ లైన్ ప్రపంచం నివ్వెరపోతోంది.

ఇక ఉత్తర కొరియాకు ఉన్న 28 వెబ్ సైట్లలో చాలా వరకూ న్యూస్ ఏజన్సీలవే కాగా, ఎయిర్ కొరియా అధికారిక వెబ్ సైట్ కూడా ఇందులో ఉంది. 'ఫ్రెండ్' పేరిట ఓ సోషల్ నెట్ వర్క్ సైట్ కూడా ఉంది.

ఉత్తర కొరియా వెబ్ సైట్లు ఇవే..

airkoryo.com.kp.

cooks.org.kp. // receips are important

friend.com.kp. // facebook clone? :D

gnu.rep.kp. // yay at least their software is free

kass.org.kp.

kcna.kp.

kiyctc.com.kp.

knic.com.kp.

koredufund.org.kp.

korelcfund.org.kp.

korfilm.com.kp. // movie4k clone at least there it is legal, lol

ma.gov.kp.

masikryong.com.kp.

naenara.com.kp.

nta.gov.kp.

portal.net.kp. // yahoo clone ;)

rcc.net.kp.

rep.kp.

rodong.rep.kp.

ryongnamsan.edu.kp.

sdprk.org.kp.

silibank.net.kp.

star-co.net.kp.

star-di.net.kp.

star.co.kp.

star.edu.kp.

star.net.kp.

vok.rep.kp.

====