Begin typing your search above and press return to search.

టైట్ జీన్స్, హెయిర్ కలర్ వేస్తే జైలుకే... కిమ్ మామ నిర్ణయం

By:  Tupaki Desk   |   11 May 2022 11:30 PM GMT
టైట్ జీన్స్, హెయిర్ కలర్ వేస్తే జైలుకే... కిమ్ మామ నిర్ణయం
X
తమ ప్రజలకు ఎప్పుడూ వింత రూల్స్ పెట్టే ఉత్తర కొరియా... మరోసారి కఠినమైన ఆంక్షలను తీసుకొచ్చింది. ఈ సారి పాశ్చాత్య సంస్కృతి ని తమ దేశంలో కట్టడి చేసేందుకు వీటిని ప్రవేశపెడుతోంది. అయితే 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని రూల్స్ తెస్తున్నట్లు అక్కడి మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. టైట్ జీన్స్, హెయిర్ కలర్, అసభ్యకర రాతల ఉండే బట్టలు ధరించడం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతోంది.

అయితే ఇలాంటి రూల్స్ పెట్టేది కేవలం తాలిబన్లు మాత్రమే అనుకున్నాం. ఆడ వాళ్లను అణిచి వేతకు గురి చేసే వాళ్లు మాత్రమే మొహం చూపించకూడదు, జీన్స్ వేసుకోవద్దు, మేకప్ వేసుకోవద్దు, పురుషులు లేకుండా దూర ప్రయాణాలు చేయొద్దు అనేది అనుకున్నాం. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కూడా దాదాపు అలాంటి బాటలోనే నడుస్తున్నారు. మరీ తాలిబన్లంత కాకపోయినా అలాంటి రూల్సే పెడుతూ.. మహిళలను స్వేచ్ఛగా బతకనీయకుండా చేస్తున్నారు.

ఇలాంటి వేషధారణతో రోడ్లపై కనిపిస్తే పెట్రోలింగ్ అధికారులు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అనంతరం నేరాన్ని ఒప్పుకొని తిరిగి అలాంటి దుస్తులు ధరించబోమని హానీ ఇచ్చిన వారిని మాత్రమే విడుదల చేస్తున్నారు. గత మే నెలలో నార్త్ కొరియా జీన్స్, హెయిర్ స్టైల్స్ ను నిషేధించింది. ఈ విదేశీ ఫ్యాషన్ అలవాట్లను ప్రమాదకరమైన విషంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ అభివర్ణించారు. ఆయన ప్రకటన అనంతరం ఈ ఆంక్షల అమలుపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూత్ లీగ్ వీటిని ప్రచారం చేస్తోంది. దేశ వ్యాప్తంగా విద్యార్థులకు సమావేశాలను నిర్వహిస్తోంది. అత్యంత తీవ్రమైన సందర్భాల్లో నిబంధనల్ని ఉల్లంఘించిన వారి పేరు, చిరునామాను లౌడ్ స్పీకర్లలో ప్రచారం చేస్తామని యూత్ లీగ్ సభ్యులు తెలిపారు. ఇన్ని నిబంధనలు విధించినా యువత విదేశీ సనిమాలు, దుస్తులు ధరించడంలో మార్పు రావండ లేదని పేర్కొన్నారు. అలాగే నార్త్ కొరియా అణు నిరాయుధీకరణ ప్రారంభిస్తే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యున్ సుక్ యోల్ హామీ ఇచ్చారు.

ఉత్తర కొరియా సమస్యను చర్చలతో పరిష్కరించుకోవడానికి సిద్ధమని మంగళ వారం తెలిపారు. ఉత్తర కొరియా అణు నిరాధీకరణ చేస్తే.. ప్రోత్సాహకాలను అందిస్తామని గతంలోనూ ప్రకటించారు. కానీ కిమ్ ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలతో దక్షిణ కొరియాతో పాటు ఈశాన్య ఆసియా కు ముప్పు ఉంటుంది.