Begin typing your search above and press return to search.
ట్రంప్ ట్వీట్...ఉత్తర కొరియా మిస్సైల్ టెస్ట్
By: Tupaki Desk | 4 July 2017 4:29 PM ISTఅంతర్జాతీయ ఒప్పందాలను లైట్ తీసుకుంటూ తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరించే ఉత్తర కొరియా మరో సంచలననానికి తెరతీసింది. తాజాగా మరోమారు మిస్సైల్‌ను పరీక్షించింది. ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఇవాళ ఉత్తర కొరియా ప్రయోగించింది. కొరియా ద్వీపకల్ప జలాల్లో ఆ క్షిపణి పడినట్లు తెలుస్తోంది. నార్త్ ప్యొంగ్యాన్ ప్రావిన్సులోని ఫంగ్యాన్ నుంచి మిస్సైల్‌ను ప్రయోగించారు. ఆ మిస్సైల్ దాదాపు 930 కిలోమీటర్లు ప్రయాణించినట్లు సౌత్ కొరియా మిలిటరీ పేర్కొంది.
ఈ ఏడాది మే 14న జరిగిన క్షిపణి పరీక్ష కంటే ఇవాళ జరిగిన పరీక్ష విజయవంతమైనట్లు సౌత్ కొరియా తెలిపింది. కొరియా ద్వీపకల్ప జలాల్లో ఆ క్షిపణి పడినట్లు తెలుస్తున్నప్పటికీ జపాన్ కు చెందిన వాణిజ్య కేంద్రంలో మిస్సైల్ పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జపాన్ తీరానికి సుమారు 200 నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి కూలినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉత్తర కొరియా వ్యవహారశైలిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అణ్వాయుధ పరీక్షలను తగ్గించుకోవాలని నార్త్ కొరియాకు ఎన్ని సార్లు చెప్పినా ఆ దేశం వినకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిణామాలతో కిమ్ జాంగ్ ఉన్‌పై అగ్రదేశాధినేత అసహనంతో ఉన్నట్లు తెలుస్తున్నది. నార్త్ కొరియా మిస్సైల్ పరీక్ష చేసిన వెంటనే దాన్ని ఖండిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/