Begin typing your search above and press return to search.

ఆ క్రూర నియంత నమ్మింది..ఆమెను మాత్రమే..వారసురాలు ఆమె..

By:  Tupaki Desk   |   22 Aug 2020 9:45 AM IST
ఆ క్రూర నియంత నమ్మింది..ఆమెను మాత్రమే..వారసురాలు ఆమె..
X
నేటి ఆధునిక యుగంలో నియంత ఎవరు.. అంటే టక్కున గుర్తుకు వచ్చేది.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏ. అతడు తన నీడను కూడా నమ్మే రకం కాదు. తన పట్ల అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా.. తన ఆదేశాలు ఉల్లంఘించినా కాల్చి చంపుతుంటాడు. తన కున్న విశేష అధికారాలతో దేశ ప్రజలను చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. ఆ దేశంలో కిమ్ ఫ్యామిలీ తీసుకొచ్చిన ఆంక్షలు అన్నీ.. ఇన్నీ కావు..చివరికి ప్రతి ఇంటా వాళ్ళ ఫోటోలు పెట్టు కుని పూజలు చేయాల్సిందే. కిమ్ తనకు శత్రువు అనిపించిన..అధికారం కోసం ఎవరైనా పోటీకి వచ్చినా వారిని నిర్దాక్షిణ్యంగా చంపుతుంటాడు.

అందుకే ఆధునిక యుగంలో అతడో నియంత అనే పేరు పొందాడు. అమెరికాను సైతం ముప్పతిప్పలు పెట్టాడు. కిమ్ ఎవరినీ నమ్మడు అనే పేరే ఉంది. అయితే తాజాగా కిమ్ తన చెల్లెలు యో జోంగ్ ని బాగా నమ్ముతారనే విషయం బయటకు తెలిసింది. ఇటీవల కిమ్ జోంగ్ కు ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు అప్పగించాడు. డి ఫ్యాక్టో సెకండ్ ఇన్ కమాండ్ గా నియమించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తర కొరియాలో కిమ్ తర్వాత అతడి వారసులు జోంగ్ అనే మాట వినిపిస్తోంది. ఇటీవల కిమ్ చాలా రోజులు కనిపించకుండా పోయాడు. అందరూ అతడు చనిపోయాడు అని అనుకున్నారు. ఆ సమయంలో ప్రభుత్వ పాలనా అంశాల్లో జోంగ్ అన్ని పనులు చక్కబెట్టారని తెలుస్తోంది. జోంగ్ అంటే కిమ్ కి ఎంతో అభిమానమని.. రానున్న కాలంలో ఉత్తర కొరియా లో జోంగ్ నే కీలకం కానున్నారని చెబుతున్నారు.