Begin typing your search above and press return to search.

క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ పబ్ రచ్చేంది సారూ?

By:  Tupaki Desk   |   19 Dec 2019 7:40 AM GMT
క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ పబ్ రచ్చేంది సారూ?
X
తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉంటుంది లిస్బాన్ పబ్. బేగంపేటలోని ఈ పబ్ తరచూ వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతుంది. ఈ మధ్యనే ఈ పబ్ లో ఒక డ్యాన్సర్ ను వ్యభిచారం చేయాలని కోరితే నో చెప్పింది. అంతే.. ఆమెపైన బ్లేడ్లతో దాడి చేసిన దారుణం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో లిస్బన్ పబ్ పేరు పలువురి నోట మారింది.

ఇదొక్కటే కాదు.. తరచూ ఈ పబ్ లో చోటు చేసుకునే ఉదంతాలు.. ఇక్కడి కార్యకలాపాల మీద చాలానే ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా నిన్న (బుధవారం) అర్థరాత్రి ఈ పబ్ మీద వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ తన టీంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పబ్ పేరుతో వినోదమే కాదు వ్యభిచారం కూడా నిర్వహిస్తున్న నిజం బయటకు వచ్చింది. పబ్ లోనూ..ఆవరణలో ఉన్న 21 మంది మహిళలతో పాటు ఇద్దరు ఆర్గనైజర్లతో సహా మొత్తం తొమ్మిది మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరి నుంచి సుమారు రూ.1.47 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే అ పబ్ లో ఇలాంటివి చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. దీనిపైన ఒక కన్నేయాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉండే పబ్ లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామం ఇప్పుడు షాకింగ్ గా మారింది.