Begin typing your search above and press return to search.
శాఖాహారుల కన్నా మాంసాహారులే బలీష్టులు
By: Tupaki Desk | 6 May 2020 10:00 PM ISTప్రపంచంలో మానవులు శాఖాహారులు, మాంసాహారులు అని రెండు రకాలు ఉంటారు. ఎవరికి ఇష్టమొచ్చింది వారు తింటారు. కానీ ఆ రెండు ఆహారాలు ఆరోగ్యానికి ముఖ్యమైనవే. కానీ ఈ రెండు ఆహారాల విషయాల్లో పలుసార్లు వాగ్వాదానికి కూడా దారి తీశాయి. దీనిపై ఎలా అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టు ఈ ఇరు ఆహారుల మధ్య ఉంటుంది. అయితే వీటిపై అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో పరిశోధన వెలుగులోకి వచ్చింది. శాఖాహారులకంటే మాంసం తినేవారే మానసిక ఆరోగ్యంతో ఎక్కువగా ఉంటారని చెబుతోంది.
క్రిటికల్ రివ్యూస్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ (Critical Reviews in Food Science and Nutrition) అనే దానిలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ కొత్త పరిశోధనల ప్రకారం.. మాంసం తినని వారి కంటే మాంసం తినేవారిలోనే మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే దానికి గల కారణాలను పరిశోధకులు వివరించారు. శాకాహారుల్లో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, స్వీయ హాని కలిగించే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆహార ఎంపికల విషయంలో ఆరోగ్యపరమైన అంశాలకు అనుగుణంగా అలవాట్లు ఉండాలని పేర్కొన్నారు.
శారీరక, సామాజిక మానసిక మార్గాల ద్వారా ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని దక్షిణ ఇండియానా యూనివర్శిటీలో అధ్యాపకులు వివరిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా శాకాహారి, మానసిక అనారోగ్యం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. మాంసం తినేవారిలో మానసిక ఆరోగ్యం మధ్య సంబంధాలను పరిశీలించడంలో కఠినమైన సమీక్ష అవసరమని గుర్తుచేశారు.
మాంసం తింటే మానసిక ఆరోగ్యం మధ్య సంబంధంపై గత పరిశోధనలను కూడా సమీక్షించి అధ్యయనం చేశారు. ఈ క్రమంలో ఈ అధ్యయనంలో భాగంగా యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఓషియానియా నుంచి మొత్తం 149,559 మందిపై అధ్యయనం చేశారని నివేదికలో తెలిపారు. మాంసం తినేవారితో కలిపి 8,584 మాంసం తినడం మానేసిన వారిపై అధ్యయనం చేశారు. శాఖాహారం విషయంలో పరిశోధకులు మాంసం తినేవారికి, మాంసానికి దూరంగా ఉన్నవారికి స్పష్టమైన వ్యత్యాసాన్ని పరిశీలించారు.
మాంసం తిని మానేసిన వారు ఎక్కువగా నిరాశ, ఆందోళన, స్వీయ-హాని కలిగించే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఒత్తిడి, అవగాహన లోపం, జీవన నాణ్యతతో మాంసం వినియోగం ఎలా సంబంధం కలిగి ఉందో అన్నదానిపై స్పష్టత తక్కువగా ఉంది. మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చడమే వ్యూహంగా తమ అధ్యయనం కొనసాగిందని.. మాంసానికి చేరువ కావాలని తమ ఉద్దేశం కాదని నివేదికలో పేర్కొన్నారు.