Begin typing your search above and press return to search.

విజయసాయి రెడ్డికి నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ

By:  Tupaki Desk   |   3 Jun 2016 8:10 AM GMT
విజయసాయి రెడ్డికి నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ
X
ఉన్నత స్థానాల్లో ఉన్న వారు కోర్టు విషయాల్ని జాగ్రత్తగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. చాలామంది ప్రముఖులు కోర్టు వ్యవహారాల్ని లైట్ గా తీసుకోవటం.. కొంపలు మునిగేటట్లు ఏదో ఒక నిర్ణయం వెలువడటం.. హడావుడిగా.. ఉరుకులు పెడుతూ కోర్టును పరిపరి విధాల వేడుకొని శాంతింపచేసే ప్రయత్నం చేయటం చేస్తుంటారు. అలాంటిదేమీ లేకుండా మొదటే స్పందిస్తే కోర్టులు ఆగ్రహించే వరకూ విషయం వెళ్లదు. కానీ.. ఈ విషయంలో చాలామంది నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు.

తాజాగా అలాంటి నిర్లక్ష్యానికి పాల్పడి.. ఇప్పుడు వార్తల్లో వచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి విజయసాయి రెడ్డి. పెద్దల సభకు వెళ్లే అంశం ఏకగ్రీవం కానున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఇబ్బందికరమనే చెప్పాలి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ నిందితుడన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో విజయసాయిరెడ్డి కూడా ఒక నిందితుడిగా ఉన్నారు. ఆయన ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుది. కానీ.. వరుసగా ఆయన కోర్టుకు హాజరు కాలేదు.

ఈ నేపథ్యంలో ఈ రోజు కేసు విచారణకు రావటం.. ఆయన గైర్హాజరు కావటంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తూ కోర్టు వారెంట్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కు వాయిదా వేశారు. కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు పొందాలనుకుంటే అందుకు తగ్గట్లు వ్యవహరించాలే కానీ.. అనవసరంగా కోర్టు ఆగ్రహానికి గురి కావటం ఎందుకన్నది విజయసాయి రెడ్డికే తెలియాలి.