Begin typing your search above and press return to search.
రేపటి నుంచే నామినేషన్లు.. ఉద్యోగుల గైర్హాజరు.. ‘పంచాయితీ’పై ఉత్కంఠ
By: Tupaki Desk | 24 Jan 2021 11:30 AM ISTఏపీలో పంచాయితీ ఎన్నికల కేంద్రంగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఏకంగా ఏపీ ప్రభుత్వం, ఉద్యోగులతో తలపడుతున్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. రేపటినుంచే నామినేషన్ల స్వీకరణ పెట్టారు. ప్రభుత్వం సహకరించకపోవడం.. ఉద్యోగుల గైర్హాజరీతో అసలు ఎన్నికలు జరిగేనా? ఆగిపోతాయా? అన్నది ఉత్కంఠగా మారింది.
నిమ్మగడ్డకు తాజాగా ఏపీ ఉద్యోగులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మధ్యాహ్నం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయితీ కార్యదర్శులు హాజరు కాకుండా ఝలక్ ఇచ్చారు.
ఇక ఏపీ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై రేపు సుప్రీంకోర్టు ఏం చేస్తుందన్న దానిపైనే ఆశలు పెట్టుకుంది. ఎన్నికలకు బ్రేక్ వేస్తుందనే ధీమాతో ఉంది. అయితే బ్రేక్ పడకపోతే ఏం చేయాలనే దానిపై జగన్ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది.
నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏపీలో రేపటి నుంచే మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏపీ అధికార యంత్రాంగం మొత్తం నిమ్మగడ్డకు సహకరించడం లేదు. దీంతో ఎన్నికల నిర్వహణపై అయోమయం నెలకొంది.
రేపు సుప్రీంకోర్టు ముందుకు ఏపీ ఎన్నిక ల కేసు వెళ్తుందా? సుప్రీం కోర్టు దీనిపై క్లారిటీ ఇస్తుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పినా తాము సిద్ధమని నిమ్మగడ్డ ప్రకటించారు. ఈ క్రమంలోనే సుప్రీం తీర్పు తర్వాత ఏపీలో ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది.