Begin typing your search above and press return to search.
భారీగా పెరిగిన నోబెల్ విజేతల ప్రైజ్ మనీ
By: Tupaki Desk | 25 Sept 2020 11:00 AM ISTఇప్పుడు నడుస్తున్నదంతా కరోనా కాలం. అవసరం ఉన్నా లేకున్నా కోతలు పెట్టేయటం.. అందుకు కరోనా పేరును తగిలించటం అలవాటుగా మారింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ అటు ప్రభుత్వాలు.. ఇటు కార్పొరేట్ సంస్థలు.. ఇలా వారు వీరు అన్న తేడా లేకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితి నెలకొంది. ఇలాంటివేళ.. ఇందుకు భిన్నంగా నోబెల్ ప్రైజ్ మనీని భారీగా పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయంగా పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచే వారికిచ్చే నోబెల్ పురస్కారానికి సంబంధించిన నగదు బహుమతిపై ఫౌండేషన్ కీలక ప్రకటన చేసింది. విజేతలకు ఇప్పటివరకు ఇస్తున్న ప్రైజ్ మనీకి ఏకంగా ఒక మిలియన్ క్రౌన్లను పెంచేస్తున్నట్లుగా పేర్కొంది. ఇప్పటివరకు 9 మిలియన్ క్రౌన్లను బహుమతిగా ఇస్తుంటే.. తాజాగా మరో మిలియన్ క్రౌన్లను పెంచుతూ నోబెల్ ఫౌండేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో.. నోబెల్ పురస్కార గ్రహీతలు పది మిలియన్ క్రౌన్లను ప్రైజ్ మనీగా అందుకోనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది.. కొన్ని కీలకమైన రంగాల్లో విశేషమైన పని చేసిన వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ప్రపంచంలో అత్యున్నత పురస్కారాల్లో నోబెల్ ఒకటిగా చెప్పాలి. 1901లో ప్రముఖ రసాయనశాస్త్రవేత్త ఆల్ ఫ్రెండ్ నోబెల్ ఈ బహుమతిని ప్రారంభించారు. రసాయన శాస్త్రంతో పాటు.. భౌతిక శాస్త్రం.. శాంతి.. సాహిత్యం.. వైద్య.. ఆరోగ్య రంగాల్లో విశేషంగా పని చేసిన వారిని ఈ బహుమతికి ఎంపిక చేస్తారు.
మొదట్లో విజేతలకు 1.5లక్షల క్రౌన్లు ఇచ్చేవారు. 1981 నాటినిక అది కాస్తా 10లక్షల క్రౌన్లుగా మారింది. 1980 - 90 మధ్యకాలంలో ఇది కాస్తా 90లక్షల క్రౌన్లకు చేరుకుంది. 2000లో దీన్ని 10 మిలియన్ క్రౌన్లుగా చేశారు. 2008లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా 8 మిలియన్ క్రౌన్లకు తగ్గించారు. తాజాగా మరోసారి దీన్ని 10 మిలియన్ క్రౌన్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మన రూపాయిల్లో చూస్తే.. విజేతకు రూ.3 కోట్ల వరకు నగదును బహుమతిగా అందించనున్నారు.