Begin typing your search above and press return to search.
86 ఏళ్ల తర్వాత పాత్రికేయులకు నోబెల్ శాంతి పురస్కారం
By: Tupaki Desk | 9 Oct 2021 9:43 AM IST12ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన నోబెల్ ను ఈ ఏడాదికి సంబంధించి వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులకు అందచేస్తున్న వైనం తెలిసిందే. ఇందులో కీలకమైన శాంతి పురస్కారాన్ని ఇద్దరు పాత్రికేయుల్ని ఎంపిక చేయటం విశేషం. దాదాపు 86 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇద్దరు పాత్రికేయులకు నోబెల్ శాంతి పురస్కారం లభించటం గమనార్హం. తొలిసారి 1907లో.. రెండోసారి 1935లో సాహస జర్నలిస్టులకు ఈ శాంతి పురస్కారం వరించగా.. ఇన్నేళ్ల తర్వాత తాజాగా ఇద్దరికి ఈ అవార్డు సొంతమైంది. ఇందులో భాగంగా వీరిద్దరికి కలిపి రూ.8.2 కోట్ల ప్రైజ్ మనీని అందిస్తారు. వీరిద్దరూ ఈ మొత్తాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.
జర్నలిస్టులు అన్నంతనే ఇప్పటి తరానికి ఒకలాంటి చులకన భావన ఉంటుంది. సమాజంలోఅత్యుత్తమ గౌరవ మర్యాదలకు ప్రతిరూపంగా ఉండే ఈ ప్రొఫెషన్.. కొందరి తీరు కారణంగా.. దీనిమీద పడే మరక అలా ఇలా ఉండదు. గతంలో వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మీడియా.. పాత్రికేయులు.. ఇప్పుడు వారే వారి తీరుతో వార్తలుగా మారుతున్న విచిత్రమైన సందర్భంగా చెప్పాలి. ఇలాంటివేళలోనే.. మనకు రోటీన్ గా కనిపించే విలువలు లేని పాత్రికేయానికి భిన్నంగా.. అత్యుత్తమ విలువలతో.. సత్యాన్ని ప్రపంచానికి చాటటమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న వారెందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన వారు తాజా విజేతలు.
నోబెల్ శాంతి పురస్కారాన్ని సొంతం చేసుకున్న పాత్రికేయుల్లో ఒకరు ఫిలిప్సీన్స్ కు చెందిన మరియా రెసా ఒకరైతే.. రెండోవారు రష్యాకు చెందిన దిమిత్రి మురాటావ్. పాత్రికేయులు ఇద్దరిని శాంతి పురస్కారానికి విజేతలుగా ఎంపిక చేసిన నేపథ్యంలో నోబెల్ కమిటీ ఛైర్మన్ బెరిట్ రైసా అండర్సన్ మాట్లాడుతూ.. ‘యుద్ధ ప్రచారం.. అబద్ధాలు.. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా స్వేచ్ఛాయుత.. స్వతంత్ర వాస్తవ ఆధారిత పాత్రికేయం మాత్రమే నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.
విజేతల్లో ఒకరైన రెసా విషయానికి వస్తే.. 2012 నుంచి ‘రాప్లేర్’ అనే న్యూస్ వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. వివాదాలు.. హత్యారాజకీయాలు.. మాదకద్రవ్యాల ఆధారిత ఆర్థిక కార్యకలాపాలతో నిండిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో పాలనపై రెసా పదునైన విమర్శలు చేస్తూ వెబ్ సైట్ లో కథనాలు.. వార్తల్ని అందిస్తుంటారు.
ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టిస్తూ.. అబద్ధపు వార్తల్ని వ్యాప్తి చేస్తూ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేయటానికి సోషల్ మీడియాను ఎలా వాడుకుంటున్నారన్న విషయాన్ని రెసా ఆధారాలతో సహా బయటపెట్టటం విశేషం.
తాజా నోబెల్ శాంతి పురస్కారాన్ని సొంతం చేసుకున్న మరో జర్నలిస్టు మురాటోవ్ విషయానికి వస్తే.. రష్యాలో అతను అధికారిక రాజకీయాలకు లొంగకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. రష్యాలో స్వతంత్రంగా పని చేస్తున్న ‘నొవాయా గజెటా’ అనే పత్రికను 1993 నుంచి నడుపుతున్నారు. రష్యాలోని ఇండిపెండెంట్ పత్రికల్లో నొవాయా గజెటా ముందు వరుసలో ఉందని చెబుతారు.
పుతిన్ పుణ్యమా అని ఆ దేశంలో సెన్సార్ షిప్ వల్ల ఇతర మీడియాలో కనిపించని వార్తలెన్నో ఈ వారపత్రికలో కనిపిస్తూ ఉంటాయి. అన్నిరకాల అధికారాన్ని ధిక్కరిస్తూ.. రష్యాలో అసలేం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలని భావించే వారికి ఇదో ఆయుధంలా పని చేస్తుందని చెప్పాలి. పరిశోధాత్మక కథనాలతో సంచలనంగా మారిన ఈ మీడియా హౌస్ లో పని చేసే పాత్రికేయుల్లో ఆరుగురు విధి నిర్వహణలో ఉండగానే దారుణ హత్యలకు గురైనా వెరవకుండా.. ముందుకు వెళ్లటం ఈ మీడియా సంస్థ ప్రత్యేకతగా చెప్పాలి.