Begin typing your search above and press return to search.

మంచి నిర్ణయం; బైకుంటే రేషన్‌ కట్‌

By:  Tupaki Desk   |   11 Jun 2015 9:59 AM IST
మంచి నిర్ణయం; బైకుంటే రేషన్‌ కట్‌
X
ఏపీ రాష్ట్రంలో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తెల్లకార్డులు తీవ్రస్థాయిలో పక్కదారి పట్టిన నేపథ్యంలో.. వాటిని తీసిపారేయటానికి.. అనర్హులుగా గుర్తించటానికి సరికొత్త నిర్ణయాన్ని తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

ద్విచక్రవాహనాలు ఉన్న వారిని తెల్లరేషన్‌ కార్డుల నుంచి తొలగించటానికి ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. కుటుంబం ఏదైనా సరే ఆ కుటుంబంలోని సభ్యులకు 100సీసీ బైకు కాని.. స్కూటర్‌ కాని ఉంటే వారికిచ్చే తెల్ల రేషన్‌కార్డును రద్దుచేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

మరో నెల రోజుల వ్యవధిలో తెల్ల రేషన్‌ కార్డుల్ని కుదించి వేయాలని ఏపీ సర్కారు ఆలోచిస్తునట్లు చెబుతున్నారు. మొత్తానికి అక్రమంగా ఉన్న రేషన్‌కార్డులు తీసి పారేసేందుకు వీలుగా బైకుల అంశాల్ని ఆధారంగా తీసుకోవటం ఏపీ సర్కారు బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం. పెద్దఎత్తున అక్రమంగా ఉన్న తెల్లరంగు రేషన్‌కార్డుల బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఏపీ సర్కారు అనుసరిస్తున్న ఈ విధానం బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.