Begin typing your search above and press return to search.

‘రెడ్డీలకు’ చేయూత - నేస్తం లేదా?

By:  Tupaki Desk   |   23 Jun 2020 7:30 AM GMT
‘రెడ్డీలకు’ చేయూత - నేస్తం లేదా?
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ భోళా శంకరుడిని తలపిస్తున్నాడు. ఏపీలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు వరాలిచ్చేస్తున్నాడు. అడిగినా అడగకపోయినా చేయూత, నేస్తం అంటూ వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. అందరికీ ఇస్తున్న జగన్ ఆయన సొంత సామాజికవర్గంలోని పేద రెడ్డిలను మాత్రం విస్మరిస్తున్నాడని ఆయా వర్గాలు వాపోతున్నాయి. మేము ఏం పాపం చేశామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఏకపక్ష విజయం సాధించడానికి ముఖ్యంగా రెడ్డిలు కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాకపోవడానికి రెడ్డిలల్లో కూడా దాదాపు 35శాతం మంది టీడీపీకి సపోర్టు చేశారు. ఆ పార్టీకే ఓటేశారు. కానీ 2019 ఎన్నికల్లో 95శాతం రెడ్డిలంతా వైసీపీకి ఓట్లు వేశారు. ఇక అంతటితో ఆగకుండా మా జగన్ అని భావించి ఇతర సామాజికవర్గాలను ప్రభావితం చేసి రాయలసీమ జిల్లాల్లోని నాలుగు జిల్లాల్లో టీడీపీ కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చేలా చేశారు.. ఏకమయ్యారు. రెడ్డిల వల్లే సీమ నాలుగు జిల్లాల్లో వైసీపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. రెడ్డిలు ఎంత ప్రభావితం చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.

ముఖ్యంగా రెడ్డిల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏపీలో ఆరు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో రెడ్డిల ఆధిపత్యం పూర్తిగా ఉంది. గుంటూరులో సగం నియోజకవర్గాలను శాసిస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టి రాయలసీమ - నెల్లూరు - ప్రకాశంలో వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఎందుకంటే రెడ్డిలు పూర్తిగా వైఎస్ జగన్ కు సహకరించిన తరువాత గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రభావం పడి ఆ జిల్లాల్లో కూడా వైసీపీ ప్రభంజనం వీచింది.

ఇలాంటి పరిస్థితుల్లో రెడ్డిలు ఉండే ఆరున్నర జిల్లాల్లో.. రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో రెడ్డిల పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ జిల్లాల్లో మెట్టభూముల కారణంగా 90శాతం మంది రెడ్డి మహిళలు పొలాలకు పోయి పనిచేసుకునే పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాలో ఆ మెట్ట భూముల్లో పంటలు పండక - పండినా పంట కు గిట్టుబాటు ధర లేక రెడ్డి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ఏడాది పాలనలో వైఎస్ జగన్ 45వేల కోట్లు సంక్షేమ పథకాలకు పెడితే.. రెడ్డిలకు వచ్చింది నామమాత్రమే అని ఆ వర్గం వారు వాపోతున్నారు. అలా అని రెడ్డి సామాజికవర్గం కిందికి దిగజారలేక - డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రెడ్డి సామాజికవర్గం వాళ్లు కూడా మాకు ప్రత్యేకంగా రెడ్డి మహిళలకు ఒక బడ్జెట్ కేటాయించి ఆదుకోవాలని కోరుతున్నారు.