Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్...కోరింది ఒకటి..దక్కింది మరొకటి
By: Tupaki Desk | 19 Nov 2018 3:46 PM ISTసినీ నటుడు కం ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఆయన కోరింది ఒకటి అయితే...దక్కింది మరొకటి అని తేలిపోయింది. ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షడు రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..ఎన్నికల్లో పోటీ చేస్తా..అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన జూబ్లిహిల్స్ స్థానం లేదా షాద్ నగర్ లేదా రాజేంద్రనగర్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆయ స్థానాలకు కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ నెలకొంది. షాద్ నగర్ లో సి.ప్రతాప రెడ్డికి..జూబ్లిహిల్స్ లో పి.విష్ణువర్ధన్ రెడ్డికి టికట్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనితో బండ్ల గణేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరగగా...కాంగ్రెస్ పార్టీ దానికి సింపుల్ గా చెక్ పెట్టి ఓ పదవి కట్టబెట్టింది.
గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బరిలోకి దిగి గెలుపొందారు. అనంతరం టీఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఈసారి కూడా ఎన్నికల బరిలో నిలుచున్నారు. మరోవైపు ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సినీ నటుడు - నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజేంద్రనగర్ స్థానాన్ని ఆశించారు. ఈ స్థానం కోసం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీ పడుతున్నారు. తన కొడుకుకు టికెట్ కోసం సబిత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, తొలి జాబితాలో ఈ ఇద్దరికీ కాంగ్రెస్ మొండి చేయి చూపింది. అనంతరం చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాజేంద్రనగర్ స్థానాన్ని సస్సెన్ష్ పెడుతూ ఉత్కంఠ కంటిన్యూ చేస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం టీటీడీపీకి కేటాయించింది. దీంతో బండ్ల గణేష్ నారాజ్ అయ్యారు.
ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని బాహాటంగానే ప్రకటించడం - వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న అనంతరం వారికి టికెట్ దక్కి తనకు మొండి చేయి చూపడంతో ఆయన తీవ్ర భంగపాటుకు గురయ్యారు. దీంతో ఇది తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఊరడించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా బండ్ల గణేష్ ను టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది. నవంబర్ 19వ తేదీ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్రాలు అందించారు. కాగా, బండ్ల గణేష్ కోరింది ఒకటైతే...ఆయనకు దక్కింది మరొకటని పలువురు చర్చించుకుంటున్నారు.