Begin typing your search above and press return to search.
కవితక్కకు భలే పాయింట్ దొరికింది
By: Tupaki Desk | 31 March 2017 3:54 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. తెలంగాణ ఉద్యమం - తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న టీఆర్ ఎస్ పార్టీకి అసలు ఆ రాష్ర్టాన్నే గుర్తించకపోతే ఎలా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమంలో సరిగ్గా అలాంటి తప్పిదమే దొర్లడంతో కవిత ఘాటుగా రియాక్టయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే...కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ట్విట్టర్ లో ఒక పోస్టర్ విడుదల చేశారు. ఏప్రిల్ 1 - 2 తేదీల్లో జరగబోయే ప్రపంచంలోనే అతిపెద్ద హాకథాన్ లో 29 మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు 598 సమస్యలపై 26 నగరాల్లో 36 గంటలపాటు సృజనాత్మక సాఫ్ట్ వీరులు పరిష్కారాలు కనుగొంటారని బృహత్తర లక్ష్యాన్ని పోస్టర్ లో ప్రకటించారు.
అయితే మనదేశ చిత్రపటంలోనే ప్రకాశ్ జవదేకర్ టీం తప్పులో కాలేశారు. తెలంగాణ మ్యాపును వేయడం మాత్రం మరిచారు. దీనిపై ఎంపీ కవిత ట్విట్టర్ లో ప్రశ్నను సంధించారు. `ప్రపంచంలోనే అతిపెద్ద హాకథాన్ అని గొప్పగా చాటారు. తెలంగాణ మ్యాపును వేయడం మాత్రం మరిచారు. ఉమ్మడి రాష్ట్రం మ్యాపు.. పక్కన హైదరాబాద్ - గుంటూరు నగరాల పేర్లు ఇచ్చి ఊరుకున్నారు. హెచ్చార్డీ మంత్రిత్వశాఖ అధికారిక మ్యాపు ఇదేనా?` అని నిలదీశారు. కాగా కవిత ట్వీట్ల తర్వాత నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున్నే స్పందన వచ్చింది. కేంద్రం తీరు హాస్యాస్పదమని పలువురు రీ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో ఏడాదివైపు పరుగులు పెడుతున్నా ఇంకా పాత మ్యాపులనే పట్టుకుని వేలాడటం ఏమిటో? అని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మ్యాపు మార్చుకోమని ఎందరో హెచ్చార్డీ మంత్రిత్వశాఖకు, మంత్రి జవదేకర్ కు సందేశాలు పంపినా స్పందించకపోవడంపై పలువురు మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/