Begin typing your search above and press return to search.

కరోనాతో సం‘తృప్తి’ కరువైందట!

By:  Tupaki Desk   |   27 May 2021 10:30 AM GMT
కరోనాతో సం‘తృప్తి’ కరువైందట!
X
కరోనా కల్లోలంతో జనాల్లో ఒక స్పష్టమైన మార్పు అయితే వచ్చింది. అదేంటంటే హంగు ఆర్భాటాలకు దూరంగా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతోనే వేడుకలు చేసుకుంటున్నారు. కరోనాతో ఎవరికి ఈ వ్యాధి సోకుతుందో..? ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందోనన్న భయం జనాలను వెంటాడుతోంది.

అందుకే ఇప్పుడు ఆకాశమంత పందిరి.. భూదేవి అంత విస్తరి ఎవరూ వేయడం లేదు. అంత ఇంట్లోనే లేదంటే మినీ ఫంక్షన్ హాల్స్ లో కానిచ్చేస్తున్నారు. ఇక తెలిసిన వారినే దగ్గరి బంధువలనే వేడుకలకు పిలుస్తున్న పరిస్థితి నెలకొంది. మునుపటిలా భారీ వేడుకలకు ఎవ్వరూ సిద్ధ పడడం లేదు.

ఇక కరోనాతో పెళ్లిళ్లు, శోభనాలు కూడా తూతూ మంత్రంగానే చేస్తున్నారు. మునుపటిలా దాన్నో వైభవంగా చేసే పరిస్థితి లేదు. పెళ్లిళ్లకు 50 మంది మాత్రమే అనుమతిస్తున్నారు.అంటే పెళ్లి కూతురు తరుఫున 25 మంది.. పెళ్లి కొడుకు తరుఫున 25 మంది.

ఇక కరోనా కల్లోల వేళ సంసార జీవితాలు కూడా సంతృప్తిగా చేసుకోని పరిస్థితి. కరోనా లాక్ డౌన్ తో చాలా మంది ఉద్యోగ, ఉపాధి పోయింది. ఈ క్రమంలోనే సంసారాల్లో కలతలు.. గొడవలు.. ఆర్థిక ఇబ్బందులతో శృంగారంపై జనాల్లో కూడా ఆసక్తిలు తగ్గిపోతున్నాయి.

వేడుకలు భారీగా చేసుకోకపోవడంతో వీటిపై ఆధారపడి బతుకుతున్న ఫంక్షన్ హాల్స్, కేటరింగ్, డీజే, వీడియో , ఫొటో గ్రాఫర్స్, మెహందీ, గుర్రపు బగ్గీలు ఇలా ఎందరో మంది ఉపాధి కోల్పోతున్నారు. ఆదాయాలు లేక తలపట్టుకుంటున్నారు. మొత్తంగా కరోనా అందరినీ మార్చేసింది. ఎంతో మందికి ఉపాధిని దూరం చేసింది. అందరిలోనూ భయాన్ని కలిగిస్తూ సంతృప్తికర జీవనానికి దూరం చేసిందనే చెప్పాలి.