Begin typing your search above and press return to search.
అమ్మో 1వ తారీఖు.. ఏపీలో జీతాలు కష్టమే?
By: Tupaki Desk | 1 Sept 2020 2:20 PM ISTఆంధ్రాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కరోనా మహమ్మారితో మరింత దిగజారింది. దీంతో అప్పుల కోసం వేట సాగించాల్సి వస్తోంది. అందులో భాగంగా ప్రతినెలా ఒకటో తారీఖున ఇచ్చే జీతాలు, పింఛన్లు ఈనెల ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక.. అప్పటికే ఏపీ అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడింది. విడిపోయాక ఏపీకి సీఎం అయిన చంద్రబాబునాయుడు ముఖ్యంగా రాజధాని ఫౌండేషన్ మీదనే దృష్టి పెట్టారు. వాటికే ఎక్కువగా ఖర్చు చేశారు. దాంతో ఆర్థిక మాంద్యం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్‌కి కూడా అది బర్డెన్‌గానే మారింది. జీతాలు ఇచ్చేందుకు కూడా కేంద్రం ఇచ్చే నిధులపై ఆధారపడాల్సి వచ్చింది.
ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఓఅండ్‌ఎం కింద రూ.500 కోట్ల వరకు ఫండ్స్ ఉన్నట్లు సమాచారం. అయితే.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సవరించడంతో ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు నుంచి రూ.5,000 కోట్లు రానున్నాయి. ఆ నిధులు రాబట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు లేఖ రాసింది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో రూ.3000 కోట్ల రుణాలు సమీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ రుణాలు కావాలన్నా కేంద్రం పర్మిషన్ కంపల్సరీ.
రిజర్వు బ్యాంకులో మంగళవారం సెక్యూరిటీల వేలం ఉండడంతో అందులో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వెంటనే కేంద్రం నుంచి ఆత్మనిర్భార్ ప్యాకేజీ నిధులు తెచ్చుకునేందుకు రెడీ అయింది. ఆ నిధులు రాగానే ఉద్యోగులకు జీతాలు, అర్హులకు పింఛన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఇప్పటికే ఒకటో తారీఖు రావడంతో ఆ సాయంత్రానికైనా నిధులు ఖాతాలో జమ అవుతాయా అని ప్రభుత్వం ఆశగా చూస్తోంది. జీతాలు, పింఛన్లకు రూ.4,300 కోట్ల వరకు అవసరం కావడంతో ఆ నిధులే సపోర్ట్ కానున్నాయి.