Begin typing your search above and press return to search.
ఊపిరి పీల్చుకో హైదరాబాద్.. 5 రోజులు వర్షాలే లేవు.. ఎందుకంటే?
By: Tupaki Desk | 22 Oct 2020 2:20 PM ISTఆకాశానికి చిల్లులు పడినట్లుగా.. ఒకటే ధారలుగా కారుతున్న వర్షాల తాకిడికి హైదరాబాద్ మహానగరం ఎంతలా వణికిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు పది లక్షల కుటుంబాలు వర్షాలకు నేరుగా ప్రభావితమైతే.. మరో నాలుగైదు లక్షల కుటుంబాలు పరోక్షంగా ప్రభావితమైన పరిస్థితి. చెరువులు నిండిపోయి.. ఎప్పుడు ఏమవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. ఇలాంటివేళ.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవన్న మాట ప్రజల్నే కాదు.. పాలకుల్ని సైతం భయాందోళనలకు గురి చేసింది.
ఇలాంటివేళ.. కాస్తంత ఉపశమనం కలిగించే విషయాల్ని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తేల్చేశారు. ఒకవేళ వర్షాలు పడినా.. గురు..శుక్రవారాల్లో ఒక మోస్తరు వర్షమే తప్పించి.. పెద్దవర్షం పడదని చెప్పటం కొండంత రిలీఫ్ గా చెప్పాలి.
ఇప్పటికే లక్షలాది కుటుంబాలు వరద నీటిలో మునిగిన వేళ.. సహాయక చర్యలు కుంటుపడుతున్నాయి. వరదనీరు ఇంకా పలుకాలనీల్లో ఉండటంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయన్న ఆందోళన ఉంది. ఇలాంటివేళ.. ఐదు రోజుల పాటు వర్షం లేకుండా ఉంటే.. సాధారణ పరిస్థితులు చోటు చేసుకునే వీలుంది.
మొదట్లో అనుకున్నట్లు మూడు రోజుల పాటు భారీ వర్షాల స్థానే అందుకు భిన్నమైన పరిస్థితులకు కారణం.. పశ్చిమ.. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతన్న అల్పపీడనం.. బుధవరాం మరింత తీవ్రమైంది. అయితే.. ఇది పశ్చిమబెంగాల్ - బంగ్లాదేశ్ తీరం వైపుగా వెళ్లే అవకాశం ఉండటంతో.. మనకు రిలీఫ్ గా మారింది. సో.. హైదరాబాద్ మహానగరమా.. ఊపిరి పీల్చుకో.