Begin typing your search above and press return to search.
సెకన్ల వ్యవధిలో కరోనా అంతు చేసే లేపనం వచ్చేసిందట?
By: Tupaki Desk | 23 Aug 2020 7:00 AM ISTప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నకరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం కోట్లాది మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రయోగానికి సంబంధించిన అప్డేట్ తప్పించి.. ఎలాంటి గుడ్ న్యూస్ వస్తున్నది లేదు. చూస్తుంటే.. వచ్చే ఏడాది మొదటికి కానీ రాదేమో అన్న మాటకు అంతకంతకూ బలం చేకూరుతోంది. ఇదిలా ఉంటే.. కరోనాను నియంత్రించే ఆయింట్ మెంట్ ఒకటి రూపొందించినట్లుగా అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఒకటి వెల్లడించింది.
ఈ లేపనానికి యూఎస్ఎఫ్ డీయే ఆమోదం కూడా తెలిపినట్లుగా చెబుతున్నారు. ఈ ఆయింట్ మెంట్ వాడాలంటే వైద్యుల సలహాలు.. సూచనలు అవసరం లేదని.. చివరకు డాక్టర్ సిపార్సు అవసరం కూడా లేదని చెబుతున్నారు. ఎవరికి వారు సొంతంగా వాడేయొచ్చంటున్నారు. ఒక్క కరోనా మాత్రమే కాదు.. పలు వైరస్ లకు చెక్ చెప్పే సత్తా తమ ఆయింట్ మెంట్ సొంతమంటున్నారు. ఇంతకీ ఈ ఆయింట్ మెంట్ పేరు ఏమంటారా? అక్కడికే వస్తున్నాం.
‘‘ఏపీటీ టీ3ఎక్స్’’ పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్న ఈ ఆయింట్ మెంట్ వాడితే.. కేవలం ముఫ్పై సెకన్ల వ్యవధిలోనే వైరస్ అన్నది కనిపించటం లేదన్న విషయం నివేదికల ద్వారా తెలిసినట్లుగా చెబుతున్నారు. ల్యాబ్ ల్లో దీన్ని పరీక్షించినప్పుడు ఈ ఆయింట్ మెంట్ అద్భుతంగా పని చేస్తున్నట్లుగా తాము గుర్తించామని అడ్వాన్స్ డ్ పెనెట్రేషన్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకుడు కమ్ సీఈవో డాక్టర్ బ్రియాన్ హ్యూబర్ తెలిపారు.
ముక్కు ద్వారా సంక్రమించే కరోనాను చెక్ చెప్పేందుకు ఈ ఆయింట్ మెంట్ ఉపయోగపడుతుందని..ఇదో గొప్ప ఆవిష్కరణగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వాటి కోసమే యావత్ ప్రపంచం ఎదురుచూస్తుందన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. దీన్ని ఉపయోగించటం చాలా తేలికగా.. ఆయింట్ మెంట్ తయారు చేసిన కంపెనీ చెబుతోంది. ఏపీటీ టీ3ఎక్స్ కరోనా వైరస్ తో పాటు ఇన్ ఫ్లూయోంజా వైరస్ లపై ప్రభావవంతంగా పని చేస్తుందని లండన్ కు చెందిన ప్రయోగశాల చెబుతోంది.
సెకన్ల వ్యవధిలో వైరస్ ను విస్తరించే శక్తిని నిర్వీర్యం చేస్తోందని చెబుతున్నారు. ఆ ఆయింట్ మెంట్ (లేపనం) ముక్కులోకి పీల్చుకోవటం ద్వారా వైరస్ సంక్రమణను దాదాపుగా అడ్డుకోవచ్చని పేర్కొంటున్నారు. దీనిపై పరిశోధనలు చేసినప్పుడు ప్రయోగశాలలో నిర్దేశిత వాతావరణంలో 99 శాతం వైరస్ లోడ్ తగ్గిందంటున్నారు. కోవిడ్ 19 మాత్రమే కాదు.. బ్యాక్టీరియా.. ఫంగస్ ల నుంచి రక్షణ కోసం కూడా దీన్ని ఉపయోగించొచ్చని చెబుతున్నారు. మరి.. దీని అసలైన పని తీరు ఏమిటన్న విషయంపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఒకవేళ.. ఈ కథనంలో పేర్కొన్నట్లుగా కరోనాను అంతం చేసే శక్తి అంతగా ఉంటే.. కొత్త కేసుల్ని పెద్ద ఎత్తున తగ్గించే వీలుందని చెప్పక తప్పదు.