Begin typing your search above and press return to search.

కాంట్రాక్టు ఉద్యోగులకు మొండిచేయి

By:  Tupaki Desk   |   19 March 2015 5:35 AM GMT
కాంట్రాక్టు ఉద్యోగులకు  మొండిచేయి
X
ఉద్యోగం ఎపుడు ఉంటుందో..ఎపుడు ఊడుతుందో అన్న ప‌రిస్థితిలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు మ‌రోమారు నిరాశే ఎదురైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీపై ఉత్తర్వులు విడుదల చేశారు. అంటే ఇక ఈ నెల నుంచి కొత్త వేతనాలు వస్తాయి. అయితే ఈ ఉత్తర్వుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల‌కు మొండి చేయి చూపారు. జీవో నంబ‌రు 25, 26, 27 ప్ర‌కారం ఆ ఫిట్‌మెంట్ లాభాలు ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్ర‌భుత్వ కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేస్తున్న వారికేన‌ని తేల్చిచెప్పారు. దీని ప్ర‌కారం కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీ లాభం వర్తించట్లేదు!!

ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంట్రాక్టు ఉద్యోగులను ప‌ర్మినెంట్ చేస్తామ‌ని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్ప‌టికీ దాన్ని కొలిక్కి తేని విష‌యం తెలిసిందే. దానిపై క‌మిటీ పేరుతో కాల‌యాప‌న వైనం తాత్కాలిక ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. పోనీ అంతవరకు ఈ పీఆర్సీ ఫలమైనా దక్కుతుందనుకుంటే అక్కడ కూడా అన్యాయమే ఎదురైంది. ఈ ప‌రిణామం వారికి పిడుగుపాటు లాంటిది.