Begin typing your search above and press return to search.

నోటుపై గాంధీ బొమ్మ పక్కా

By:  Tupaki Desk   |   4 Aug 2016 10:09 AM IST
నోటుపై గాంధీ బొమ్మ పక్కా
X
కరెన్సీ నోట్లపై జాతిపిత గాంధీ బొమ్మ ఉండటం తెలిసిందే. ఈ మద్య కాలంలో గాంధీ బొమ్మ స్థానంలో పలువురు జాతీయ నాయకుల ఫోటోలు ఉండాలంటూ వాదన మొదలుకావటం.. సోషల్ మీడియాలో వీటిపై పలురకాల వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో.. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మకు స్థానం చలనం తప్పదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇదే సందేహాన్ని ప్రశ్న రూపంలో సంధించారు ఒక రాజ్యసభ సభ్యుడు. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాలా స్పందిస్తూ.. కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మను తొలగించే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ‘‘అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు’’ లేదని తేల్చారు.

మరోవైపు.. ఎలాంటి కరెన్సీని ముద్రించాలి.. భద్రతా ప్రమాణాలు.. డిజైన్లు లాంటి అంశాల్ని కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయని.. ఆర్ బీఐ సహకారంతో నోట్లను ఎలా రూపొందించాలన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు. సో.. కేంద్రమంత్రుల మాటల నేపథ్యంలో.. నోట్ల మీద గాంధీ బొమ్మ మారే అవకాశం కనుచూపుమేరలో లేదని చెప్పాలి.