Begin typing your search above and press return to search.
సినిమా అనుకున్నావా సీఎం కావటమంటే పవనా?
By: Tupaki Desk | 9 April 2019 11:52 AM ISTరీల్ లైఫ్ కు అలవాటైన ప్రాణాలు రియల్ లైఫ్ లోకి ఒక పట్టాన రావన్న మాట వినిపిస్తూ ఉంటుంది. రీల్ లో ఏం కావాలనుకుంటే అది అయిపోవచ్చు. కానీ.. రియల్ లో అది సాధ్యం కాదు. ఈ విషయం సామాన్యుడికి అర్థమైనా.. సినిమావాళ్లకు ఒక పట్టాన అర్థం కావన్న సటైరు వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇదెంత వాస్తవమో తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్ని వింటే ఇట్టే అర్థం కాక మానదు.
తనకు సీఎం కావాలన్న ఆశ లేదంటూ మూడేళ్ల క్రితం మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఏడాది క్రితం తన అభిమానులు అదే పనిగా సీఎం.. సీఎం అంటూ అరుస్తున్న వేళ పల్చగా నవ్వేవారు. రుషిలా ఫోజు పెట్టి.. పదవుల మీద ఆశ లేదనే వారు. అదేం సిత్రమో కానీ.. గడిచిన ఆర్నెల్లుగా అదే పనిగా ప్రజల్లోకి తిరిగిన పవన్.. సీఎం కుర్చీ మీద చాలానే ఆశలు పెట్టుకున్న వైనం తాజాగా బయటకు వచ్చేసింది.
తాను కానీ బరిలోకి దిగిన వెంటనే.. సమీకరణాలన్ని మారిపోయి తాను సీఎం అయిపోతానన్న ఫీలింగ్ లో ఉన్నారో ఏమో కానీ.. పవన్ ప్రస్తుతం భయంకరమైన ఫస్ట్రేషన్లో ఉన్నారా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.
ఎన్నికలకు ఒక పక్కా వ్యూహం లేకుండా.. సరైన టీం లేకుండా ముందుకెళ్లిన పవన్.. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేరన్న విషయాన్ని అన్ని సర్వేలు ఒకేలా చెప్పేస్తున్నాయి. మహా అయితే.. మూడు సీట్లకు మించి జనసేనకు రావన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.
ఏపీ రాజకీయాల్లో తాను కీ రోల్ ప్లే చేస్తానన్న భావనతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. అందుకు భిన్నంగా చతికిలపడిపోవటాన్ని ఆయన ఊహించనట్లున్నారు. తాజాగా వినిపిస్తున్న అంచనాలు.. ఏపీలో పొలిటికల్ సీన్ పవన్ లో కొత్త మనిషిని బయటకు తెస్తోంది. తాజాగా.. పవన్ ను చూసిన వెంటనే ఆయన అభిమాన గణం.. ఎప్పటి మాదిరి సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయటం పవన్ కు చిరాకు తెప్పించింది.
తనలోని అసహనాన్ని దాచుకోని పవన్ బరస్ట్ అవుతూ.. మీరు పవన్ కల్యాణ్ సీఎం.. సీఎం అని అరవండి. అక్కడేమో చంద్రబాబు పథకాల పేరుతో ప్రజల డబ్బు పంచేస్తున్నారు. పదేసి వేలు.. పదేసి వేలు ఇస్తున్నారు. జగన్ వాళ్లు రెండేసి వేలు పంచేస్తున్నారు. ఇక.. ఏం సీఎం. మీరు మాత్రం పవన్ కల్యాణ్ సీఎం అని అరుస్తుంటారు.. అరవటం కాదు.. ఓట్లు వేయండంటూ పవన్ చేసిన వ్యాఖ్య చూస్తుంటే.. కాస్త ఆలస్యంగా అయినా పవన్ కు తత్త్వం బోధ పడినట్లుగా కనిపించక మానదు.