Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఎన్నికల్లో ఈ అభ్యర్థి రూటు రోటీన్ కు భిన్నం
By: Tupaki Desk | 22 Nov 2020 10:45 AM ISTఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరం మీద మామూలు కంటే ఎక్కువ ఆసక్తి వ్యక్తమవుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని కొనసాగించాలని బీజేపీ ఊవ్విళ్లూరుతుంటే.. గులాబీ దళం మాత్రం బ్రేకులు వేయాలని భావిస్తోంది. అంతేకాదు.. గ్రేటర్ ఎన్నికల ఫలితంతో దుబ్బాకను మర్చిపోయేలా చేయాలనుకుంటోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. గ్రేటర్ పరిధిలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఒకరి తీరు మాత్రం అందరిని ఆకర్షిస్తోంది. తరచూ తన తీరుతో వార్తల్లో దర్శనమిచ్చే టీఆర్ఎస్ అభ్యర్థి.. సిట్టింగ్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి తీరే భిన్నమని చెప్పాలి. సాధారణంగా ఎన్నికల ప్రచార సమయంలో మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తూ.. వార్తల్లో కనిపించాలని తెగ ఊవ్విళ్లూరుతుంటారు.
అలాంటి వారికి సైతం రాని కొత్త ఐడియాలు వేయటం సామా గొప్పతనం. హయత్ నగర్ డివిజన్ కు చెందిన ఈ టీఆర్ఎస్ కార్పొరేటర్.. మిగిలిన కార్పొరేటర్లకు సైతం భిన్నం. మురుగునీరు రోడ్ల మీద తరచూ నిలిచిపోవటంపై డివిజన్ ప్రజల కంటే కూడా ఈయనే ఎక్కువగా ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. అధికారుల తీరుకు నిరసనగా.. మురుగునీటిలో పడుకొని సంచలనంగా మారారు. అంతేకాదు.. అక్రమంగా ఇసుకను లారీల్లో తరలిస్తున్న తీరుకు నిరసనగా.. ఆర్టీఏ అధికారుల కాళ్లను పట్టుకొని వార్తల్లో నిలిచారు.
పరిమితికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఆపి.. డ్రైవర్ తో పాటు.. ప్రయాణికుల చేత గుంజీలు తీయించిన గొప్పతనం ఎవరికైనా ఉందంటే సామాకు మాత్రమేనని చెప్పాలి. ఇలాంటి ఆయన తాజాగా తన ఎన్నికల ప్రచారాన్ని ఆయన భిన్నంగా చేపట్టారు. ఒంటె మీద కూర్చొని తన డివిజన్ ప్రజల్ని.. ఓటర్లను ఆకర్షిస్తున్నారు. సాధారణంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలుకరించే అభ్యర్థులు.. ఓటర్లకు దగ్గరగా వెళ్లాలని భావిస్తుంటారు. సామ మాత్రం అందుకు భిన్నంగా ఒంటె మీద కూర్చొని దూరంగా అభివాదం చేస్తూ.. తన ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. వినూత్నంగా వ్యవహరించే ఈయన విషయంలో ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.