Begin typing your search above and press return to search.

ర‌విప్ర‌కాశ్ మ‌రీ ఇంత ఒంట‌రా?

By:  Tupaki Desk   |   13 May 2019 6:30 AM GMT
ర‌విప్ర‌కాశ్ మ‌రీ ఇంత ఒంట‌రా?
X
తెలుగు టీవీ రంగానికి సంబంధించి తోపు లాంటి ప్ర‌ముఖుడు ఎవ‌ర‌న్న మాట‌కు టీవీ 9 ర‌విప్ర‌కాశ్ (ఇప్పుడు మాజీ అనుకోండి) అన్న స‌మాధానం బ‌లంగా వినిపించేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ మీడియా ముఖ్యుల్లో ఆయ‌న స్థానం ప్ర‌ముఖంగా ఉండేది. అలాంటి ఆయ‌న్ను ట‌చ్ చేయ‌టం మామూలు వారి వ‌ల్ల కాద‌ని.. మెరుగైన స‌మాజం పేరుతో ఆయ‌న అందించే వార్త‌ల‌పై చాలామందికి కినుకు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న బ‌లాన్ని ట‌చ్ చేసే ధైర్యం ఎవ‌రూ చేయ‌లేద‌నే చెప్పాలి.

ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఉదంతంలో ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఒక క‌న్ను వేశారో.. ర‌విప్ర‌కాశ్ బ‌లం అనుకున్నంత ఏమీ లేద‌న్న విష‌యంపై కాస్త క్లారిటీ వ‌చ్చింది. అయితే.. కేసీఆర్ కున్న బ‌లం ముందు ర‌విప్ర‌కాశ్ తేలిపోయారే కానీ.. ఆయ‌న మామూలోడు కాద‌న్న భావ‌న మొన్న‌టి దాకా ఉండేది.

ఎప్పుడైతే రూ.500 కోట్లు పెట్టి టీవీ9 కొన్న పెద్ద‌మ‌నుషుల‌కు సైతం చుక్క‌లు చూపించ‌టం.. ఇక లాభం లేద‌నుకొని వారు తామేమిటో చూపించ‌టం మొద‌లైన నాటి నుంచి ర‌విప్ర‌కాశ్ కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. టీవీ9కు సంబంధించి ప్ర‌జ‌ల త‌ర‌ఫున తాను మాట్లాడుతున్న‌ట్లుగా చెప్పుకున్న ర‌విప్ర‌కాశ్ మాట‌ల్ని ప్ర‌తి ఒక్క‌రు త‌ప్పు ప‌ట్ట‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌జ‌ల త‌ర‌ఫున టీవీ9 గురించి మాట్లాడుతున్న‌ట్లుగా చెబుతున్న ర‌విప్ర‌కాశ్ మాట‌ల్లో అర్థం లేద‌ని.. ఎందుకంటే టీవీ9 సంస్థ ప‌బ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దంటున్నారు. ర‌విప్ర‌కాశ్ మీద వివిధ అంశాల‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌టంతో పాటు ఆయ‌న‌పై కేసు న‌మోదు త‌ర్వాత నుంచి ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా గ‌ళం విప్పుతున్న వారి సంఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది.

ఒక మీడియా ప్ర‌ముఖుడిగా ఇన్ని ద‌శాబ్దాలుగా ఉన్న ర‌విప్ర‌కాశ్ వెంట మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాల‌తో పాటు.. ప్ర‌ముఖులు.. జ‌ర్న‌లిస్టులు.. జ‌ర్న‌లిస్ట్ సంఘాలతో పాటు.. చివ‌ర‌కు సామాన్య జ‌నం కూడా వెంట ఉండ‌క‌పోవ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. సోష‌ల్ మీడియాలో అయితే ర‌విప్ర‌కాశ్ మీద పెల్లుబికిన వ్య‌తిరేక‌త‌కు మీడియా వ‌ర్గాల‌కు చెందిన వారు సైతం విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు మీడియా ప్ర‌ముఖుడిగా ఒక వెలుగు వెలిగిన వ్య‌క్తి మీద‌.. జ‌న‌సామ్యంలో ఇంత వ్య‌తిరేక‌త ఉందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఎవ‌రూ త‌న ప‌క్షాన నిలిచేలా చేసుకోలేక‌పోయిన ర‌విప్ర‌కాశ్ గొప్ప‌త‌నం ఏముంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.