Begin typing your search above and press return to search.
కరోనా గురించి ఆ దేశంలో ఎవరికీ తెలియదట ..అసలు నిజమేంటి
By: Tupaki Desk | 21 Sept 2021 4:00 PM ISTకరోనా వైరస్ .. ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ మహమ్మారి విజృంభణ అలా కొనసాగింది. చైనా లో మొదలైన ఈ మహమ్మారి వ్యాప్తి ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తిస్తూ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ సమయంలో కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చారు. ఒక వేవ్ పోయింది , రెండో వేవ్ కూడా వచ్చింది. అయితే , ఆ దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట.
ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తుర్క్‌మెన్ అధికారులు కొన్ని క్వారంటైన్ చర్యలు చేపట్టారు. తాము తీసుకున్న చర్యల వల్లే దేశం కోవిడ్ రహిత దేశంగా ఉందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.కుర్బనోవ్ చికిత్స తీసుకున్న ఆసుపత్రిలో కూడా ఎక్కడా కోవిడ్ అనే పదాన్ని వాడలేదు. ఈ వైరస్, ఈ రోగం అనే అనేవారు అని ఆయన చెప్పారు.అసలైన జబ్బేమిటో ఎందుకు చెప్పరని నేను వాళ్ళను బలవంత పెట్టేవాడిని. ఇది కోవిడేనా అని అడిగేవాడిని. వారు నెమ్మదిగా తలాడించేవారు అని చెప్పారు.
కుర్బనోవ్ ఆసుపత్రిలో ఉండగా గాలిలో దుమ్ము ఉండటం వల్ల ప్రజలంతా ముఖానికి మాస్కు వేసుకోవాలని చెబుతూ ప్రభుత్వం చేసిన వైద్య హెచ్చరిక సందేశం వచ్చింది. మనం ధూళి వల్ల చచ్చిపోతున్నామా, అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను చావనిస్తారుగానీ, కోవిడ్ ఉందని మాత్రం వాళ్లు ఎప్పటికీ అంగీకరించరు అని కుర్బనోవ్ అన్నారు. కరోనా వైరస్ తమ దేశంలో లేదని, తమది కరోనా వైరస్ లేని దేశమని ప్రకటించుకున్న తుర్క్‌మెనిస్తాన్‌లో గత కొంత కాలంగా అడవి మూలికల (స్థానికంగా యుజెర్లిక్ అని పిలుస్తుంటారు) అమ్మకాలు, వినియోగం మాత్రం బాగా పెరిగాయి. ఔషధ గుణాలు ఉన్నాయని భావించే ఈ మూలికలను ఎన్నో దశాబ్దాలుగా తుర్క్ మెనిస్తాన్ తో పాటు ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని పలు దేశాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. నిర్ధిష్ట పద్ధతిలో కనుక ఈ అడవి మూలికలను కాల్చి, ఇంట్లో పొగ వేస్తే.. దాని ధాటికి బ్యాక్టీనియా చనిపోతుందని దేశాధ్యక్షుడు గుర్ బంగూలి బెర్దీముఖమేదోవ్ ప్రకటించారు.
తుర్క్ మెనిస్తాన్ లో ఉన్న విదేశీ మీడియా సంస్థలు ఇక్కడ మొదలైన మూడవ వేవ్ ఇన్ఫెక్షన్ల గురించి రిపోర్ట్ చేస్తున్నాయి, కానీ, ఆ దేశంలో మాత్రం ఈ విషయం గురించి మాట్లాడటానికి ప్రతీ ఒక్కరూ భయపడుతున్నారు. మహమ్మారి మొదలైనప్పటి నుంచీ 60 మందికి పైగా కరోనావైరస్ బారిన పడి మరణించినట్లు ది తుర్క్ మెన్.న్యూస్ వెబ్ సైట్ పేర్కొంది.కరోనా కేసులు నమోదవుతున్నట్లు తుర్క్ మెన్ అధికారులు వెల్లడించరు. దేశాధ్యక్షుడు గుర్ బంగూలి బెర్దీముఖమేదోవ్ తమ దేశం ఆరోగ్యకరమైన దేశంగా నిలిచిందనే ప్రతిష్టను ప్రచారం చేసుకోవడానికి చూస్తారు. ఆయన మాజీ దంత వైద్యుడు. తమ దేశం మహమ్మారి బారిన పడిందని అంగీకరిస్తే, ఆయన పాలన తీరు పై ప్రభావం చూపిస్తుందేమోననే సందేహాలున్నాయి. కానీ, గతేడాది నమోదయిన ఒక్క కేసు ఈ మొత్తం వ్యవహారాన్ని బయటకు తెచ్చింది.