Begin typing your search above and press return to search.

రూ'పాయే' మీద ఫిక‌ర్ వ‌ద్దంటున్న‌జైట్లీ!

By:  Tupaki Desk   |   6 Sep 2018 6:32 AM GMT
రూపాయే మీద ఫిక‌ర్ వ‌ద్దంటున్న‌జైట్లీ!
X
డాల‌రుతో రూపాయి మార‌కం విలువ అంత‌కంత‌కూ ప‌డిపోతూనే ఉంది. రోజులు గ‌డుస్తున్న కొద్దీ బ‌ల‌ప‌డాల్సిన రూపాయి బ‌ల‌హీనం చెందుతోంది. మొన‌గాడు లాంటి మోడీ అధికారంలోకి వ‌స్తే.. రూపాయి బాహుబ‌లి మాదిరి మారిపోతుంద‌ని.. విలువ‌ను పెంచేస్తాన‌ని.. డీజిల్.. పెట్రోల్ రేట్ల‌ను త‌గ్గిస్తాన‌ని సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందు మా గొప్ప‌లు చెప్పిన వాటిల్లో నిజాలు ఏ రీతిలో ఉన్నాయ‌న్న‌ది ఇప్పుడు అంద‌రికి క‌నిపిస్తూనే ఉంది.

రోజురోజుకీ రూపాయి ప‌త‌నంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. అలాంటి భ‌యాలేమీ పెట్టుకోవ‌ద్ద‌ని.. అస‌లేమీ కాద‌న్న‌ట్లుగా భ‌రోసాను ఇస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌పంచంలోని మిగిలిన దేశాల‌తో పోలిస్తే రూపాయి ప‌రిస్థితి బాగుంద‌న్నారు.

కొన్నాళ్లుగా రూపాయి విలువ స్థిరంగా ఉంద‌న్న ఆయ‌న‌.. రూపాయి విలువ ప‌డిపోవ‌టానికి కార‌ణం అంత‌ర్జాతీయ రాజ‌కీయ ప‌రిణామాలే కార‌ణంగా చెప్పారు. రూపాయి ప‌త‌నానికి దేశీయ కార‌ణాలు ఏమీ లేవ‌ని.. దేశ ఆర్థిక రంగంలో ఎలాంటి సంక్షోభాలు లేవ‌ని వ్యాఖ్యానించారు.

గ‌డిచిన కొన్ని నెల‌లుగా ప్ర‌పంచంలోనిఅన్ని క‌రెన్సీల‌తో పోలిస్తే డాల‌ర్ బ‌ల‌ప‌డుతోంద‌ని.. రూపాయి ప‌త‌నం కార‌ణంగా త‌లెత్తే ఇబ్బందుల్ని అధిగ‌మించేందుకు ఆర్ బీఐ అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లుగా చెప్పారు. రూపాయి ప‌త‌నం మీద ఇప్ప‌టికిప్పుడు స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

రూపాయితో పోలిస్తే.. బ్రిట‌న్ పౌండ్‌.. యూర‌ప్ దేశాల యూరోల క‌న్నా మంచి స్థితిలో ఉంద‌ని చెప్పారు. ఇప్పుడిన్ని మాట‌లు మాట్లాడుతున్న జైట్లీ మాష్టారు.. తాను అధికారంలో లేకుండా విప‌క్ష నేత‌గా ఉండి ఉంటే.. ఇదే మాట‌ల్ని చెప్పేవారా? ఏసీ గ‌దుల్లో కూర్చొని అర‌చేతిలో అధికారాన్ని ఉంచుకొని 135 కోట్ల ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ల్ని రాసే స్థితిలో ఉన్న‌ప్పుడు రూపాయి ప‌త‌నం పెద్ద విష‌యంగా అనిపించ‌క‌పోవ‌చ్చు. ప్ర‌పంచ వ్యాప్తంగా పోలిక‌లు తీసుకురావ‌చ్చు. కానీ.. స‌గ‌టుజీవి జీవితంలో రూపాయి ప‌త‌నం చేసే న‌ష్టాన్ని మ‌దింపు చేసి మాట్లాడితే కాస్త బాగుంటుంది. మొన‌గాడు లాంటి మోడీ హ‌యాంలో ప్ర‌పంచ‌దేశాల క‌రెన్సీ బ‌ల‌హీనం కావ‌టాన్ని ప్ర‌స్తావించి పోల్చుకునే క‌న్నా.. అంద‌రి క‌రెన్సీ త‌గ్గుతున్నా.. మ‌న‌ది మాత్రంస్థిరంగా ఉంద‌న్న మాట చెప్ప‌లేన‌ప్పుడు మోడీ పాల‌న భేష్ అని ఎలా చెప్ప‌గ‌లం?