Begin typing your search above and press return to search.
మోడీ వీకెండ్ టూర్స్ తెలంగాణలో లేనట్లే!
By: Tupaki Desk | 29 Aug 2018 11:59 AM ISTప్రధాని మోడీ వ్యవహరించే తీరు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. అయితే.. ఆయన అనుసరించే విధానాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు.. తక్కువలో తక్కువ ఎన్నికల హడావుడి స్టార్ట్ కావటానికి ఆర్నెల్ల ముందు నుంచి ఆ రాష్ట్రానికి ప్రతి వీకెండ్ లేదంటే.. రెండు వీకెండ్స్ కు ఒకసారి చొప్పున తన పర్యటనను పెట్టుకుంటారు.
అభివృద్ధి కార్యక్రమాలనో.. మరో కారణాన్నో చూపించి.. ఆ రాష్ట్రంపై తనకున్న శద్రాశక్తుల గురించి విస్తృతంగా ప్రచారమయ్యేలా చేస్తారు. ఎన్నికల హడావుడి షురూ అయ్యే నాటికి తన వరుస పర్యటనలు చర్చనీయాంశంగా మారటమే కాదు.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కేంద్రం చల్లని చూపు తమ రాష్ట్రం మీద పడటమే కాదు.. తమ రాష్ట్రానికి ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ ఇచ్చే ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. బీజేపీకి అధికార దండాన్ని అందిస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగేలా చేస్తారు.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వ్యూహాన్ని మోడీ అమలు చేయటం కనిపిస్తుంది. ఈ తరహా వ్యూహంతోనే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు పెరిగేలా మోడీ చేశారని చెప్పాలి. మరి.. దక్షిణాదిన పాగా వేయాలన్న ఆలోచనలో ఉన్న మోడీ.. ఆ దిశగా పలు ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వని పరిస్థితి. ఇలాంటి వేళ.. దక్షిణాది సంగతి మరింత ఫోకస్ పెట్టాలనుకున్న వేళ.. అదే పని చేస్తే మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
దక్షిణాదిన పాగా వేసే కన్నా.. అక్కడ తమకు అనుకూలమైన వారి చేతుల్లో అధికారం ఉండే కొత్త ప్లాన్ ను బీజేపీ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే వ్యూహాన్ని తమిళనాడులో అమలు చేసే ప్రయత్నం చేసినా.. తమిళులు ఆ విషయాన్ని గుర్తించి.. బీజేపీని మరింత వ్యతిరేకించటం షురూ చేశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో తాను ప్రభావితం చూపే కన్నా.. తమకు విధేయుడిగా ఉంటానని మాట ఇచ్చిన (?) కేసీఆర్ పై మోడీషాలు నమ్మకం పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు.
తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళలో.. ఆయా రాష్ట్రాల మీద మోడీ దృష్టి సారించాలే కానీ.. తెలంగాణపై అస్సలు అక్కర్లేదన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికారపీటంపై ఎలాంటి ఆశలు మోడీషాలకు లేవు. అలాంటప్పుడు బీజేపీయేతర రాష్ట్రాల్లో అమలు చేసిన వ్యూహాన్ని పక్కన పెట్టేసి.. తన వీకెండ్ టూర్స్ ను మరో రాష్ట్రంలో చేపడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. సో.. మోడీ వీకెండ్స్ టూర్స్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు.