Begin typing your search above and press return to search.
ఎంత ఎదిగినా... దేవుడి పాదాల కిందే
By: Tupaki Desk | 9 Nov 2020 6:00 AM ISTకొందరి విశ్వాసాలు ఎదుటి వారికి ఆశ్చర్యంగా ఉంటాయి. వాటిని చూసిన ఇరుగుపొరుగు కొందరు కామెంట్ చేస్తుంటారు. అయితే, ఈ ఊరులోని ప్రజలు అలాంటి వారు కాదు. వారంతా ఒకే మాటకు కట్టుబడి ఉంటున్నారు. ఒకే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. అదే దేవుడి కంటే తాము గొప్ప వాళ్లం కానే కాదనే విశ్వాసం. భగవంతుడి పాదాల కిందే ఉండాలనే భావనతో ఒక అంతస్తుకు మించి ఇంటి నిర్మాణాలు చేపట్టడం లేదు ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామం వాసులు. ఆశ్చర్యం, అద్భుతం అనే భావనను కలిగించే ఈ ఊరు విశేషాలివే.
సింగరాయకొండ గ్రామంలో చారిత్రక శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. తమ ఇష్ట దైవమైన వరాహ లక్ష్మీనరసింహస్వామిపై భక్తితో ఎన్నో సంవత్సరాలుగా ఓ కీలక ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ గ్రామంలో ఎటు చూసినా పక్కా ఇళ్లే కనిపిస్తాయి. ఇక్కడి వారందరికీ 2, 3 అంతస్తుల భవనాలు నిర్మించుకునే స్తోమత ఉన్నప్పటికీ, ఒక్కరు కూడా అలా చేయలేదు. ఎందుకంటే, ఆలయంలోని స్వామి పాదాల కన్నా తక్కువ ఎత్తులోనే భవనాలు నిర్మించుకోవాలని అనుకోవడం.
చారిత్రక శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి ఏటా తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. గ్రామస్తులే మోత కాపులుగా ఉంటూ.. స్వామి వారి సేవల్లో పాల్గొంటారు. దేవుడి పాదాల కంటే తమ ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటే శుభకరమని అందుకే తాము ఇలా ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. తమ ఆచారానికి విఘాతం కలిగితే నష్టాలు జరుగుతాయని గ్రామస్తులు చెప్తుంటారు. సింగరాయకొండ గ్రామంలో పాఠశాల భవనంపై మొదటి అంతస్తు నిర్మించగా.. ఆ కాంట్రాక్టర్ ఇంట్లో ఒకరు మరణించారని గ్రామస్తులు చెబుతుంటడం వారి విశ్వాసానికి నిదర్శనం.