Begin typing your search above and press return to search.

విశాఖ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగం లైవ్ లేదు

By:  Tupaki Desk   |   10 Sep 2016 4:42 AM GMT
విశాఖ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగం లైవ్ లేదు
X
ప్ర‌ముఖ సినీ నటుడు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున ప‌వ‌న్ అభిమానులు - జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో... ఏం చెపుతారో అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రూ సాయంత్రం 4 గంట‌ల‌కు టీవీల‌కు అతుక్కుపోయారు. ఇక ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని ప్ర‌త్య‌క్ష‌ ప్ర‌సారం చేసేందుకు అన్ని న్యూస్ ఛానెల్స్ రెడీ అయ్యాయి.

ప‌వ‌న్ ప్ర‌సంగం ప్రారంభ‌మైంది...అంద‌రూ ఆస‌క్తిగా ప్ర‌సంగం వింటున్నారు. ప‌వ‌న్ కేంద్రంతో పాటు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు - బీజేపీకి చెందిన కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడును ఓ రేంజ్‌ లో ఆడేసుకుంటున్నారు. ఇంత‌లో ఏమైందో ఏమోగాని విశాఖ‌లో కేబుల్ టీవీలు రావ‌డం ఆగిపోయాయి. ప‌వ‌న్ ప్ర‌సంగం ప్రారంభ‌మైన వెంట‌నే విశాఖ‌ప‌ట్నంలోని గాజువాక ఏరియాలో కొంద‌రు కావాల‌నే కేబుల్ వైర్లు క‌ట్ చేసిన‌ట్టు ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ప‌వ‌న్ ప్ర‌సంగం చూడ‌కుండానే దండుగులు, జ‌న‌సేన వ్య‌తిరేకులు ఇలా చేశార‌ని... కేబుల్ వైర్లు కట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ అభిమానులు కేబుల్ టీవి ఆపరేటర్లకు ఫిర్యాదు చేశారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా ప‌వ‌న్ ప్ర‌సంగం ప్రారంభ‌మైన వెంట‌నే కేబుల్ టీవీ ప్ర‌సారాల‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక ప‌వ‌న్ కాకినాడ స‌భ‌లో హోదా విష‌యంలో బీజేపీ - టీడీపీల‌లో టీడీపీని కాస్త సుతిమెత్త‌గా విమ‌ర్శించినా, బీజేపీతో పాటు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు - ఏపీకి చెందిన టీడీపీ ఎంపీల‌ను పేర్ల‌తో స‌హా ఏకిప‌డేశారు. ప్ర‌ధాని మ‌న‌కు ఇచ్చిన రెండు పాచిపోయిన ల‌డ్డూల కంటే బంద‌రు ల‌డ్డూ - తాపేశ్వ‌రం కాజా చాలా బాగుంటాయ‌ని కూడా ప్యాకేజీపై అదిరిపోయే రేంజ్‌ లో విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ వాళ్లు వెన్నుపోటు పొడిచార‌ని...బీజేపీ ద‌గ్గ‌ర‌కు వెళితే వారు పొట్ట‌లో పొడిచార‌ని ప‌వ‌న్‌ విమ‌ర్శించారు.