Begin typing your search above and press return to search.
ఆ నియోజకవర్గంలో టీడీపీకి దిక్కెవరు?
By: Tupaki Desk | 15 Sept 2020 12:20 PM ISTరాజకీయాల్లో పార్టీ ముఖ్యమా? వ్యక్తులు ముఖ్యమా? ఈ ప్రశ్నలకు సంబంధించిన వాదనల్లో ఎవరి భాష్యం వారిది. కొన్ని ప్రాంతాల్లో పార్టీని బట్టి అభ్యర్థితో సంబంధం లేకుండా ప్రజలు ఓట్లేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో అభ్యర్థికున్న ఇమేజ్ ను బట్టి ఓట్లేస్తారు. ఆ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆ పార్టీలో ఉన్నంత కాలం...ఇటు పార్టీకి, అటు ఆ నేతకు ఇద్దరికీ లాభమే. కానీ, ఆ పార్టీని సదరు నేత వీడినా కూడా తనకున్న ఇమేజ్ ఆధారంగా వేరే పార్టీలోనూ రాణిస్తాడు. కానీ, ఆ నేత వెళ్లిన తర్వాత పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేకుంటే మాత్రం పార్టీకి మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎదుర్కొంటోంది.ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లోల పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేక ఇబ్బందులు పడుతోంది. ఏపీలో టీడీపీకి ఇటువంటి నావికుడు లేని నావ వంటి నియోజకవర్గాలు 30 వరకు ఉంటాయి. ఈ తరహా నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఒకటి. రామచంద్రాపురంలో టీడీపీని ముందుండి నడిపించిన తోట త్రిమూర్తులు పార్టీని వీడి 8 నెలలు అవుతున్నా.....ఆ నియోజకవర్గంలో టీడీపీని నడిపించేవారు లేకపోవడం చర్చనీయాంశమైంది.
చాలా కాలంగా రామచంద్రపురం నియోజక వర్గంలో టీడీపీని తోట త్రిమూర్తులు ముందుండి నడిపిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో త్రిమూర్తులుకు మంచి పట్టుంది. దీంతో, త్రిమూర్తులును చంద్రబాబు కూడా ఎంకరేజ్ చేశారు. రొటీన్ కు భిన్నంగా పార్టీ కంటే వ్యక్తులకు చంద్రబాబు ప్రాధాన్యమిచ్చిన నియోజక వర్గాల్లో రామచంద్రాపురం ఒకటి. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా పేరున్న త్రిమూర్తులుకు కాపు ఓటు బ్యాంకు నేపథ్యంలోనూ బాబు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో, ఆ నియోజక వర్గంలో త్రిమూర్తులు పార్టీ కంటే బలంగా తయారయ్యారు. త్రిమూర్తులు తర్వాత పార్టీలో నంబర్ 2 లేకుండా పోయారు. అనూహ్యంగా త్రిమూర్తులు పార్టీని వీడడంతో ఇపుడు పరిస్థితి తారుమారైంది. త్రిమూర్తులు పార్టీని వీడి 8 నెలలు కావస్తున్నా...పార్టీని ముందుండి నడిపించే బలమైన నాయకుడు కరువయ్యాడు.
సాధారణంగా నియోజకవర్గ స్థాయిలో నంబర్ 2లు స్వయంగా తయారవడం...లేదంటే తయారు చేసిపెట్టుకోవడం పార్టీలకు ఆనవాయితీ. పొరపాటున తురుపుముక్క వంటి నేతలు పార్టీ వీడినా...ఆ స్థానంలో నంబర్ 2లు పగ్గాలు అందుకుంటారు. ఇలా పగ్గాలు అందుకొని కీలక నేతలుగా ఎదిగిన వారూ ఉన్నారు. కానీ, టీడీపీలోని 30 నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి లేదు. అందులోనూ ప్రత్యేకంగా రామచంద్రాపురంలో త్రిమూర్తులు స్థానాన్ని భర్తీ చేసే నేత కరువయ్యారు. దీంతో, పార్టీని వీడినా...చాలామంది నేతలు త్రిమూర్తులు చుట్టే తిరుగుతున్నారట. దీంతో, ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమను నడిపించే నాయకుడు లేకపోవడంతో... చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా ఫలితం ఉండడం లేదట. ఈ నేపథ్యంలోనే రామచంద్రాపురంతో పాటు ఆ 30 నియోజక వర్గాల్లో కేడర్ బలహీన పడి....సైకిల్ కుదేలైందట. మరి, ఈ పరిస్థితి ని 40 ఈయర్స్ ఇండస్ట్రీ బాబు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.