Begin typing your search above and press return to search.

అక్కడ టీడీపీకి దిక్కెవరు?

By:  Tupaki Desk   |   29 July 2020 9:00 AM IST
అక్కడ టీడీపీకి దిక్కెవరు?
X
ఒక్క ఓటమితో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయిపోతాయి. టీడీపీకి కంచుకోట అయిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం అంటే టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి పెట్టని కోటగా ఉండేది. ఆయన అక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. రెండు దఫాలు మంత్రిగా కూడా అయ్యారు.

కానీ ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి కుమారుడు సుధీర్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు.మొన్నటి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ నుంచి పోటీచేసిన సుధీర్ రెడ్డి పోరాడి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గెలిచేశాడు.

అప్పటి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి.. ఆయన తండ్రి గోపాలకృష్ణ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదట..వీరిద్దరూ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలపై దాడులు జరిగినా.. కేసులు పెడుతున్నా ఇక్కడ అడిగే వాళ్లే లేకుండా పోయారట.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ బాబులకు ఫిర్యాదు చేసినా కూడా బొజ్జల ఫ్యామిలీ శ్రీకాళహస్తి వైపు కన్నెత్తి చూడడం లేదు.

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రెచ్చిపోతూ టీడీపీ నేతలను వైసీపీలోకి లాగి ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల బ్రాండే లేకుండా చేయాలని కంకణం కట్టుకుంటూ పావులు కదుపుతున్నారట.. మరి ఇప్పటికైనా ఓటమి నైరాశ్యం నుంచి బొజ్జల ఫ్యామిలీ కోలుకొని మళ్లీ పట్టు సాధించకపోతే పూర్తిగా ఈ కంచుకోట నుంచి వైదొలగే పరిస్థితి వస్తుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.